ఖమ్మం

పసీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), నవంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానానే్న కొనసాగించాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు జివి నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. యుటిఎఫ్ నగర కార్యాలయంలో కె కుటుంబరావు అధ్యక్షతన నగరశాఖ ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ విధానం ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మరణశాసనంగా మారిందన్నారు. ఈ విదానం వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుందన్నారు. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానానే్న కొనసాగించాలని డిమాండ్ చేస్తూ యుఎస్‌పిసి ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించబడుతున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు, కార్యదర్శి బుర్రి వెంకన్న, నగరశాఖ కార్యదర్శి వి నర్సింహారావు, ఉద్దండ్, షరీప్, కెఎ మధుసూదనరావు, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
పాతపెన్షన్ విధానం అమలు చేయాలి
బోనకల్: ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రస్తుతం అమలుచేస్తున్న సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటిఎఫ్ మండల కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ పాతపెన్షన్ విధానం అమలు చేయటంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసిన ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని గత రెండు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని స్తంభింపచేసినా, ఇంకా ఈ పాపాన్ని గత ప్రభుత్వాల మీద తోస్తోందన్నారు. నవంబర్ 24న పాతపెన్షన్ విధానం అమలు కోరుతూ చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.