ఖమ్మం

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏన్కూరు, నవంబర్ 17: స్థానిక పోలీస్‌స్టేషను ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీసు తఫ్సీర్ ఇక్బాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. తొలుత రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. మండలంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు (విపిఒ)లు గ్రామాల్లోకి వెళుతున్నారా లేదా, మండలంలో ఎన్ని పంచాయతీలు, గ్రామాలు ఎన్ని జనాభా ఎంత అని అడిగి తెలుచుకున్నారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులకు రశీదులు ఇస్తున్నారా లేదా అని పరిశీలించారు. పోలీస్‌స్టేషన్ అంతా కలియ తిరిగి సౌకర్యాలు, హరితహారం కింద నాటిన మొక్కలు పరిశీలించి చాలా బాగుందన్నారు. జిల్లాలో పోలీస్‌శాఖ ఆద్వర్యంలో హరితహారం కింద 30 లక్షలు మొక్కలు నాటినట్లు తెలిపారు. హరితహారంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉందన్నారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

నైతిక విలువలను పెంపొందించే శతకపద్యాలు
* సుమతీశతక పఠనంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు
సత్తుపల్లి, నవంబర్ 17: శతక పద్యాలు మానవ విలువలకు అద్దం పడుతాయని వీటివలన నైతిక విలువలు అలవడతాయని ఖమ్మం జిల్లా విద్యాధికారి డి. వాసంతి అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యాశాఖ, గ్రంధాలయ సంస్థ, గార్లపాటి పాపాచలం, బొల్లేపల్లి మధుసూదనరాజు సేవా ట్రస్ట్, నాగండ్ల అనీల్ సంస్థల ఆధ్వర్యంలో సత్తుపల్లి మండల విద్యార్థులు సుమతీ శతక పద్యాలను ధారణ చేయగా ఈ కార్యక్రమం తెలుగుబక్ ఆప్‌లో నమోదైంది. ఆ సంస్థ అధికార ప్రతినిధి డా బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుబుక్ ఆప్ రికార్డ్ దృవీకరణ పత్రాన్ని నిర్వాహకులు రామకృష్ణ, మధుసూధనరాజుకు అందజేశారు. 15ప్రభుత్వ పాఠశాలలు, 12 ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 141మంది సుమతీ శతకాన్ని ధారణతో సామూహిక పఠనం చేశారు. ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ డిఈఓ వాసంతి మాట్లాడుతూ మాతృబాషలో విద్యార్థులు నైపుణ్యం సాధించినట్లయితే ఇతర బాషలను సులభంగా నేర్చుకోవచ్చని అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజుల్‌హక్ (ఖమర్) కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ గ్రంధాలయ స్వర్ణోత్సవాలు ప్రపంచ తెలుగుమహాసభలను పురష్కరించుకొని పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని అభినందించారు.