ఖమ్మం

పాపకొల్లు పంచాయతీ సర్పంచ్ చెక్‌పవర్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, నవంబర్ 17: మండల పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీ పాపకొల్లు సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేయటంతో పాటు, ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తూ జిల్లా పంచాయతీల అధికారి ఆశాలత గురువారం ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీలోని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేసి, కొందరు ఉద్యోగులు,ప్రజా ప్రతినిధులు దుర్వినియోగం చేశారని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాల్వంచ ఇవోపిఆర్డీ రామశాస్ర్తీ పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకుని రెండు విడతలుగా విచారణ నిర్వహించారు. విచారణాధికారి నివేదిక ప్రకారం డిపివో ఆశాలత శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగు నీటి పథకాల నిర్వహణ, విద్యుత్ మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు, అంతర్గత రహదారుల మరమ్మతులు, విద్యుత్ పరికరాల కొనుగోలు వంటి పలు అంశాల్లో రూ.9.68 లక్షల వ్యయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ సమయంలో విధులు నిర్వహించిన కార్యదర్శులు యాకూబ్ ఆలీ, శంకర్, భారతిలకు షోకాజ్ నోటీసులు ఇవ్వటంతోపాటు, సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దుచేసి, ఆర్థిక లావాదేవీలను నిలుపుదల చేస్తూ చర్యలు తీసుకున్నారు.
చర్చనీయాంశంగా మారిన నిధుల దుర్వినియోగం
మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్ల కాలంగా ఇప్పటి వరకు కాకర్ల, బేతాళపాడు, కొమ్ముగూడెం, పడమట నర్సాపురం, పాపకొల్లు పంచాయతీల్లో ఆరోపణలు తలెత్తటంతోపాటు, విచారణలు జరిగాయి. ఆయా గ్రామాలకు చెందిన యువకులు, విద్యావంతులు సమాచార హక్కు చట్టం ప్రకారం తీసుకున్న సమాచారంతో ఉన్నతాధికారులకు పక్కాగా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవటం గమనార్హం. మండలంలోని మొత్తం 12 గ్రామ పంచాయతీల్లో సగం పంచాయతీలు ఆరు చోట్ల విచారణలు జరిగాయి. గత రెండు నెలల క్రితం బేతాళపాడు పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. తాజాగా పాపకొల్లు పంచాయతీలో జరిగిన అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోవటంతో మరింత చర్చనీయాంశంగా మారింది. మండలంలోని పంచాయతీలపై పర్యవేక్షణ కొరవడిన కారణంగానే అభివృద్ధి నిధుల దుర్వినియోగం, అక్రమాల వంటి ఆరోపణలు తలెత్తుతున్నాయని అంటున్నారు.