ఖమ్మం

శివాలయాన్ని అభివృద్ధి చేస్తే ఊరు చల్లగా ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిజర్ల, నవంబర్ 17: శివాలయాన్ని అభివృద్ధి చేస్తే ఊరు చల్లగా ఉంటుందని ప్రముఖ సినీ రచయిత, హాస్యనటుడు, నిర్మాత తనికెళ్ళ భరణి అన్నారు. మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామంలోని చంద్రవౌళీశ్వరాలయంలో నూతనంగా నిర్మించనున్న ఆలయ నిర్మాణానికి శుక్రవారం పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కమిటీని ఏర్పాటు చేసి వచ్చే ఏడాది నాటికి నూతన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.
కమిటీకి తాను గౌరవ సలహా దారునిగా ఉంటానని, నిర్మాణంలో ఎదురయ్యే సాధక బాధకాలను తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలన్నారు. గ్రామస్థలందరూ ఐక్యంగా ఉండాలని, అందరూ సహకరిస్తే ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి అవుతుందన్నారు. పాత ఆలయాన్ని కొనసాగిస్తూనే ఆగమన శాస్త్రం ప్రకారం కొత్త ఆలయాన్ని నిర్మించాలన్నారు. 20 లక్షలు డిపాజిట్ చేస్తే మరో 20 లక్షలు ఇచ్చేందుకు దేవాదయ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆలయ కమిటీ చైర్మన్ కమాటాల ఎల్లయ్య భరణికి తెలపగా తన వాటగా లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించి వేదికపై ప్రకటించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల కోరిక మేరకు పాఠశాలను సందర్శించారు. ఇప్పుడు కష్టపడితే, జీవితాంత సుఖపడతారని విద్యార్థులకు సూచించారు. కష్టపడి బాగా చదివి యావత్ దేశం గర్వపడే విధంగా తనికెళ్ళ పేరు ప్రతిష్టలను వినుమడింప చేయాలన్నారు. సాధించాలనే పట్టుదల ఉంటే విజయం సులభ తరవౌతుందన్నారు. కార్యక్రమనంతరం పాఠశాలలోఉపాధ్యాయులు, శివాలయంలో స్థానికలు, అయ్యప్ప భక్తులు భరణిని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తేజావత్ వనిత, ఎంపిటిసి గాజుల కృష్ణమూర్తి, అర్చకుడు ప్రసాద్ శర్మ, అన్నారపు వెంకటేశ్వర్లు, పివిరావు తదనితరులు పాల్గొన్నారు.

భూ ప్రక్షాళన ప్రక్రియను వేగవంతం చేయాలి
* కలెక్టర్ లోకేష్‌కుమార్

ఖమ్మం, నవంబర్ 17: జిల్లాలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను వేగవంతం చేసి డిసెంబర్ 15నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అన్ని మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. ప్రజ్ఞా సమావేశ మందిరంలో శుక్రవారం తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ ప్రక్షాళన ప్రక్రియను పకడ్భందీగా నియమ, నిబంధనల మేరకు చేపట్టాలన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా భూములకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా సజావుగా నిర్వహించాలని సూచించారు. ప్రతి రికార్డును సక్రమంగా నిర్వహించి నిర్దేశించిన పట్టికలలో పూర్తి సమాచారాన్ని పొందుపర్చాలన్నారు. ఇప్పటివరకు పూర్తయిన గ్రామాలకు సంబంధించిన సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. ఇనాం భూములకు సంబంధించి ఇప్పటి వరకు సమర్పించిన తహశీల్దార్లు వెంటనే సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారికి పంపాలన్నారు. పెండింగ్ ఫైల్ అప్‌లోడ్ చేసే ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అటవీ, వక్ఫ్‌భూములకు సంబంధించిన సర్వే ప్రక్రియ నిర్వహించి సమగ్ర నివేదిక పంపాలన్నారు. చెక్‌లీస్ట్‌తో పాటు నిర్దేశించిన పట్టికలలో భూముల వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి వినయ్‌కృష్ణారెడ్డి, ట్రైనీ కలెక్టర్ హన్మంత్‌కొడింబా, తహశీల్దార్లు పాల్గొన్నారు.