ఖమ్మం

వ్యక్తులను తీర్చిదిద్దేది గ్రంథాలయాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 18: సమాజంలో వ్యక్తులను తీర్చి దిద్దేది గ్రంథాలయలేనని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా స్థానిక జిల్లా గ్రంథాలయంలో శనివారం నిర్వహించిన వారోత్సవాలో ఆయన ముఖ్య అతిథిగ పాల్గొని మాట్లాడుతూ గ్రంథాలయాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు. గ్రంథాలయాలను ఆశ్రయించిన వారిలో ఎంతోమంది మంత్రులు, సివిల్‌సర్వీసెస్ ఉద్యోగాలలో స్థిరపడ్డారన్నారు. మారుతున్న సమాజంలో ఇంటర్నెట్, గూగుల్ ప్రాధాన్యత పెరిగినప్పటికి, గ్రంథాలయాల ఆదరణ మాత్రం తగ్గలేదన్నారు. పుస్తక పఠనంద్వారా పాఠకులు ఎంతో విజ్ఞానాన్ని సమపార్జిస్తారన్నారు. ఇంటర్నెట్ వెంట పరుగులు పెట్టే వారు పుస్తక పఠనాన్ని అలవరచుకోవాలన్నారు.గ్రంథాలయాల అభివృద్దికి తమ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. అనంతరం గ్రంధాలయాల్లో చదువుకుంటూ ఉద్యోగాలు సాధించిన 8మంది ఉద్యోగులను ఎమ్మెల్యే త్కరించారు. ఈ కార్యఅకమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఖమర్, పైరెక్టర్లు మగ్బుల్, పగడాల నాగరాజు, కార్పొరేటర్‌లు మురళి, వెంకటరమణ, గ్రంథాలయాల సంస్థ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
ఖమ్మం(స్పోర్ట్స్), నవంబర్ 18: రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ అండర్-19పోటీలు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు 3రోజులు పాటు జరుగుతాయి. పోటీలను లీగ్‌కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు జూనియర్ కళాశాల క్రీడా సంఘం కార్యదర్శి గోవిందరెడ్డి తెలిపారు. పోటీలకు ముఖ్య అతిధిగా వచ్చిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ చేయగా క్రీడా వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల ప్రతిభా పాటవాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, ప్రతిభ గల క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలతో పాటు పారితోషికాలను ఇస్తుందన్నారు. రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు పరమేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర పోటీలను నిర్వహించటానికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులను ఒప్పించామన్నారు. జిల్లాలో బాస్కెట్‌బాల్‌కు మంచి ఆదరణ ఉండటంతో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా సంఘం కార్యదర్శి గోవిందరెడ్డి మాట్లాడుతూ 10జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలను కల్పించామన్నారు. ఇక్కడ పోటీల అనంతరం రాష్ట్ర జట్టును ఎంపిక చేసి జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు పంపిస్తామన్నారు. నిర్వాహకులు పక్షపాత ధోరణి అవలంబించకుండా కమిటీలను వేశామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోషియేషన్ అధ్యక్షుడు అనంతరాములు, నెట్‌బాల్ అసోషియేషన్ కార్యదర్శి రమణ, శిక్షకులు సైదులు, భరత్, శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు.