ఖమ్మం

జనవరి నుంచి 24గంటల విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 18: ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యవౌతుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కూసుమంచి మండలం ఈశ్వరమాధారంలో 17.50లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనానికి, కూసుమంచిలో 73లక్షలతో నిర్మించనున్న పాఠశాల అదనపు గదుల శంకుస్థాపన, 39లక్షల రూపాయలతో నిర్మించిన ఆరు అదనపు పాఠశాల గదుల నిర్మాణాలకు శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించిన వారౌతారన్నారు. ప్రతి ఇంటిలో 5మొక్కలు నాటిన వారికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా ఒక గేదెను అందిస్తామన్నారు. అభివృద్థిలో మహిళ బాగస్వామ్యం ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు చెందిన పేద విద్యార్థుల అభ్యున్నతికి ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. తల్లిపిల్లల ఆరోగ్యం పరిరక్షణ కోసం ఏటా 1600కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామన్నారు. విదేశి చదువుల కోసం 25లక్షల వరకు ఆర్థిక సహయం అందిస్తున్నామన్నారు. జనవరి 1వ తేది నుండి వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ను అందిస్తామని వెల్లడించారు. మరుగుదొడ్లు, డబుల్‌బెడ్ ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక తోలకం విషయంలో ఏలాంటి అడ్డంకులు కల్పించవద్దని పోలీస్‌లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జడ్పి సిఇఓ మారుపాక నగేష్, డిఆర్‌డిఎ పిడి మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.