ఖమ్మం

అంతా భక్తి మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లెందు, నవంబర్ 18: అది అటవీ ప్రాంతం. వేలాదిగా జనం తరలివచ్చారు. కుల, మతాలను విస్మరించి భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ఇది నాగుల్‌మీరా ధర్గా ప్రత్యేకత. ఇల్లెందు పట్టణ పొలిమేరలోని అటవీ ప్రాంతంలో కొలువుదీరిన నాగుల్‌మీరా దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనం అశేశంగా ఉత్సవాల్లో పాల్గొని నియమ నిష్టలు, భక్తి శ్రద్దలతో నాగుల్‌మీరాను ఆరాదించారు. రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్సవాల్లో పాల్గొన్నారు. మూడురోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఐదు కిలోమీటర్లకు పైగా భక్తజనం తెల్లటి దుస్తులు ధరించి కలశాలతో ఊరేగింపు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలో కళా ప్రదర్శనలను ప్రదర్శించారు. గుర్రపు జట్కాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక్కసారిగా భక్తజనం తెల్లని దుస్తులు ధరించి నిర్వహించిన ఊరేగింపు ప్రజలను ఆనందంతో పాటు భక్తి భావాన్ని పెంపొందింపజేసింది. 15వ ఉర్సు ఉత్సవాల్లో గతంకన్నా మరింత అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని రెండవ నెంబర్ బస్తీలో ఉన్న హజరత్ ఖాసీం దుల్వా దర్గాలో తొలిరోజు పూజలు నిర్వహించారు. మలిరోజున నాగుల్‌మీరా దర్గాలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆదివారంతో ఉర్సు ఉత్సవాలు ముగియనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.