ఖమ్మం

ఘనంగా ఇందిరాగాంధీ శత జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), నవంబర్ 19: భారత మాజీ ప్రధాని, భారతరత్న దివంగత ఇందిరాగాంధీ శత జయంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు కేక్‌కట్‌చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం సెంటర్, గ్రెయిన్‌మార్కెట్, త్రిటౌన్ ప్రాంతాల్లోని ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీనివాసనగర్‌లోని అయ్యప్ప గుడి వద్ద పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానిగా భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. బడుగు, బలహీన అభ్యున్నతికి, మత సామరస్యం కోసం ఆహర్నిశలు పాటుపడ్డారన్నారు. తుది శ్వాస విడిచే వరకు ఆమె దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 20సూత్రల పథకం, బ్యాంకుల జాతీయకరణ వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో నిలిచిపోయారన్నారు. మత సామరస్యం, దేశ సమైఖ్యత, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతామని, పేదలు, రైతుల, కార్మికుల అభ్యున్నతి కోసం పనిచేస్తామని కార్యకర్తలచే ప్రమాణం చేయించారు. తొలుత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహారావు, దీపక్‌చౌదరి, బాలగంగాధర్‌తిలక్, మహిళా జిల్లా అధ్యక్షురాలు బండి మణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏజన్సీ ఏరియాల్లో గిరిజనులకు భూమిపై హక్కు కల్పించాలి
కొత్తగూడెం, నవంబర్ 19: హరితహారం పేరుతో తెలంగాణ ప్రభుత్వం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కుంటుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఏజన్సీ ఏరియాల్లో గిరిజనులకు భూమిపై సర్వ హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక లక్ష్మీదేవిపల్లిలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అన్ని ప్రాంతాల్లో అదే స్థాయిలో నిర్మించాలని డిమాండ్ చేశారు. మైలారం ప్రాంతంలో రాగి గనులను పునః ప్రారంభించాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్, వై శ్రీనివాసరెడ్డి, గుత్తుల సత్యనారాయణ, సలిగంటి శ్రీనివాస్, జమలయ్య, మారపాక రమేష్, జి నగేష్, లక్ష్మీపతి, జనార్ధన్, గోవిందు, కల్లెం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను కొనసాగించాలి
దుమ్ముగూడెం, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనైతిక నిర్ణయాల వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఐద్వా మండల కార్యదర్శి సరియం రాజమ్మ దుయ్యబట్టారు. ఐద్వా కటాయిగూడెం గ్రామ సమావేశం మర్మం సుజాత అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో రాజమ్మ మాట్లాడుతూ నగదు బదిలీ వద్దు అని, ప్రజా పంపిణీ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల వస్తువులను ప్రజలకు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆమె అన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాటాయిగూడెం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా కె.వెంకటమ్మ, సవలం జానకిలతో పాటు 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు. మర్మం సుజాత, ఆదెమ్మ, నాగమ్మ, సాయమ్మ, మంగమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.