ఖమ్మం

పేర్లు మార్చినంత మాత్రాన అభివృద్ధి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత కాంగ్రెస్ పాలనలో ఉన్న పథకాల పేర్లను మార్చినంత మాత్రాన అదే అభివృద్ధి అనుకుంటే పొరపాటేనని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యంతో కలసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కెసిఆర్‌లు కాంగ్రెస్ హయాంలో మాజీ ప్రధానులు నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లను తొలగించి వాటికి మరొ పేర్లు పెట్టినంత మాత్రాన తామేదో సాధించామని గొప్పలు చెప్పుకోవడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర మంత్రి కెటిఆర్ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడం ఎవరితరం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డంకిగా మారిందని టిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న అసత్యప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్, పాలేరు జలాశయాలు కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమైనవని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యితిరక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు వడ్డెబోయిన నర్సింహారావు, కట్ల రంగారావు, బండి మణి తదితరులు పాల్గొన్నారు.