ఖమ్మం

విద్యాసంస్థలను అడ్డుకున్న తుడుందెబ్బ నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పినపాక, నవంబర్ 21: ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో ఆదివాసీ హక్కులపై న్యాయపోరాటం చేస్తున్న ఆదివాసీ విద్యార్థులపై భౌతికదాడి చేసిన లంబాడీ సామాజికవర్గంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం పినపాక, కరకగూడెం మండలాల్లో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యాసంస్థలను అడ్డుకునేందుకు తుడుందెబ్బ నాయకులు ముందుకొచ్చి పినపాక మండలంలో ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల, గురుకుల పాఠశాల, మినీ గురుకుల పాఠశాలను అడ్డుకోగా జూనియర్ కళాశాలను అడ్డుకున్నారు. దుగినేపల్లి గ్రామంలో కూడా పాఠశాలలను అడ్డుకున్నారు. కాగా కరకగూడెం మండలంలో చిరుమల్ల గ్రామంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎక్కువ లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటంతో బంద్‌ను వ్యతిరేకిస్తూ పాఠశాలలకు వెళ్లడంతో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ నాయకులు పిట్టల లక్ష్మినారాయణ మాట్లాడుతూ అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్న ఆదివాసీ గిరిజనుల కోసమే 1/70 చట్టాన్ని అమలు చేస్తున్నారని, దీన్ని అడ్డు పెట్టుకొని లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చడంతో గిరిజన చట్టాలకు అడ్డం లేకుండా పోతుందన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించినప్పుడే అసలైన ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గొగ్గల రామకృష్ణ, కొమరం శ్రీను, చుంచు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సహాయ పౌర సంబంధాల అధికారిగా కలవల శ్రీనివాస్
కొత్తగూడెం, నవంబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ పౌర సంబంధాల అధికారిగా కలవల శ్రీనివాస్‌ను నియమితులయ్యారు. కొత్తగూడెం పౌర సరఫరాశాఖ ప్రచార సహాయకులుగా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు పదోన్నతి కల్పిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. సహాయ పౌర సంబంధాలశాఖ అధికారిగా నియమితులైన శ్రీనివస్‌ను డిపిఆర్వో శ్రీనివాసరావు, టైపిస్ట్ రాజేష్, సిబ్బంది అనిల్, ముత్తయ్యలు అభినందించారు.
భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు
భద్రాచలం టౌన్, నవంబర్ 21: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరిచిన తర్వాత సుప్రభాతం పలికి ఆరాధన జరిపాక నామార్చనలు చేశారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. బేడా మండపంలో విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించి కంకణధారణ జరిపారు. ప్రవర తర్వాత కన్యాదానం నిర్వహించి యోక్త్ధ్రారణను నయనానందంగా చేశారు. సమస్త మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మంత్రోచ్ఛారణలు మిన్నంటగా నిత్యకల్యాణం కమనీయంగా సాగింది. నిత్యకళ్యాణంలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. కల్యాణం అనంతరం నిర్వహించిన దర్బార్ సేవ వైభవంగా జరిగింది.