ఖమ్మం

కుల వ్యవస్థను రూపుమాపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 21: సమాజంలో కుల వ్యవస్థను రూపుమాపితేనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం సుధాకరరావు అన్నారు. స్థానిక కొత్తకాలనీలో మంగళవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవస్థలో కులం పేరుతో మనిషి మానవత్వాన్ని మరిచిపోతున్నాడని, ఎవరికి వారు ఆంక్షలు పెట్టుకొని మనిషిని మనిషిలా చూడలేకపోతున్నారని అన్నారు. కులం పేరుతో సమాజంలో వివక్ష, అంటరానితనం కొనసాగుతుందన్నారు. వన భోజనాలను సైతం కుల భోజనాలుగా మారుస్తూ భవిష్యత్ తరాలకు కులం రంగు పులుముతున్నారని, ఇది మ ంచి పద్ధతి కాదన్నారు. వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రజాస్వామిక, లౌకికవాదులంతా ముందుకు రావాలని కోరారు. సమావేశంలో కోటా న ర్సింహారావు, గడ్డం సందీప్, ఆదినారాయణ, రమణకుమారి, సుశీల, పద్మలు పాల్గొన్నారు.
ఆదివాసీల ర్యాలీ
గుండాల, నవంబర్ 21: మండల కేంద్రమైన గుండాలలో మంగళవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ నిర్వహిం చి, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వాగబోయిన చంద్రయ్య మాట్లాడుతూ లం బాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చే శా రు. వారిని జాబితా నుంచి తొలగించే వరకు ఆదివాసీల పోరాటం ఆగదని అన్నారు. ఆదిలాబాద్‌లో అంద్ తెగ కు చెందిన ఆదివాసీ యువకునిపై లం బాడీలు దాడి చేశారని ఆరోపించారు. నీతి మాలిన చర్యలు ఆపకపో తే లం బాడీలకు తగు విధంగా బుద్ధి చెపుతామని హెచ్చరించారు.
భాజపా వాణిజ్య విభాగం
జిల్లా కన్వీనర్‌గా సుబ్బారావు
భద్రాచలం టౌన్, నవంబర్ 21: భారతీయ జనతాపార్టీ వాణిజ్య విభాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్‌గా మారేమళ్ళ సుబ్బారావును నియమిస్తూ భాజపా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. తన నియామకానికి కృషి చేసిన జిల్లా అధ్యక్షుడికి ఈ సందర్భంగా సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు.
సాగునీరు అందించడమే టీఆర్‌ఎస్ లక్ష్యం
దుమ్ముగూడెం, నవంబర్ 21: మండలంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న భూములకు సాగునీరు అందించే దిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బత్తుల శోభన్‌బాబు అన్నారు. లక్ష్మినగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల నిరంతరం కృషి చేస్తున్నారని, మండల అభివృద్ధిపై వారు ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. ప్రగళ్లపల్లి గోదావరిపై లిఫ్ట్ పునరుద్ధరించి చిన్నగుబ్బలమంగి ప్రాజెక్టులోకి ఎత్తిపోతల ద్వారా నీరు పంపి తద్వారా 100 చెరువులకు సాగునీరు అందేలా ప్ర భుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. రైతు లు పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని గిట్టుబాటు ధర దక్కించుకోవాలని అన్నారు. మ ండల అధ్యక్ష, కార్యదర్శులు తోటమ ల్ల సుధాకర్, లక్ష్మణ్, జానీపాషా, శే ఖర్, శివ, నాగేంద్రరెడ్డిలు పాల్గొన్నారు.