ఖమ్మం

నకిలీ ఎస్సీ సర్ట్ఫికెట్లు రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, నవంబర్ 21: మండలంలో క్రైస్తవులుగా చెలామణి అవుతూ నకిలీ ఎస్సీ సర్ట్ఫికేట్లు పొందారని, వాటిని రద్దు చేయాలని దళిత హిందూ మాలనాడు వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షుడు జెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం పెట్టిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం క్రైస్తవులే ఉన్నారని, వారు బీసీ కులానికి చెందిన వారని, వారిని పరిగణనలోకి తీసుకోకూడదని ఎంపీడీవోకు ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి క్రైస్తవులకు ఎస్సీ సర్ట్ఫికేట్లు ఇవ్వడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. అర్హులకు న్యాయం చేయాలని ఎంపీడీవోను కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో పున్నారావు, వన్నాల రవి, జోగారావు, శ్రీను, సంగీతరావు, ప్రభాకర్‌రావు, రఘు తదితరులు పాల్గొన్నారు.
సారా స్థావరాలపై దాడి
*నలుగురిపై కేసు నమోదు
గుండాల, నవంబర్ 21: మండలంలోని సాయనపల్లి గ్రామంలో స్థానిక ఎస్సై శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సారా స్థావరాలపై మంగళవారం దాడులు నిర్వహించి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఇరపా వెంకన్న, వాగబోయిన పెద్ద లక్ష్మయ్య, కత్తుల వెంకన్న, పోలెబోయిన లక్ష్మిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఎస్సై మాట్లాడుతూ సారా తయారీకి పాల్పడినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో
హమాలీ రేట్లు పెంపు
దుమ్ముగూడెం, నవంబర్ 21: దుమ్ముగూడెం మండలంలో సీఐటీయూ అనుబం ధ తెలంగాణ హమాలీ కాటా కార్మికుల రేట్లను మ ంగళవారం నుంచి పెంచారు. గత వారం రోజులుగా కూలీ రే ట్లు పెరగాలని సమ్మె చేసిన హ మాలీలు మంగళవారం స మ్మెను విరమించారు. బండిరేవు గ్రా మంలో జరిగిన సమావేశంలో సీఐటీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు కె. చిలకమ్మ, మిత్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వ్యాపారస్తులతో చర్చలు జరిపారు. హమాలీల రేట్లు పెంచేందుకు వ్యాపారస్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం హమాలీ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక జరిగింది. మండలాధ్యక్షుడిగా మంగయ్య, కార్యదర్శిగా ఖాదర్‌బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హమాలీ రేట్లు పెంచడంతో రైతు నాయకుడు యలమంచి శ్రీనుబాబు, యలమంచి వంశీ కృషిని పలువురు హమాలీలు అభినందించారు.