ఖమ్మం

జిల్లాకే పెళ్లికళ వచ్చేసింది....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెళ్లి సందడి మొదలైంది. మార్గశిరమాసం మొదలై పెళ్లి కళ తెచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పంచాంగం ప్రకారం పెళ్లి ముహుర్తాలు ఉన్నాయి. అందునా 23, 24, 25 తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నట్లు పురోహితులు తెలిపారు. ఈ దివ్యమైన ముహూర్తాల్లో జిల్లాలో వందలాది జంటలు ఏకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫంక్షన్‌హాల్స్, హోటల్స్‌కు డిమాండ్ పెరిగింది. ఈనెల 23వ తేదీ నుంచి 24, 25 తేదీల్లో జిల్లాలో సుమారు 1500 మంది దంపతులు ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజులే కాక ఈనెల 26, 29 తేదీల్లో కూడా జిల్లాలో మరో 1000 పెళ్లిళ్ల వరకు జరగునున్నట్లు అంచనా. దివ్యమైన ముహూర్తాలు కావడం, మరో రెండున్నర నెలల వరకూ మంచి ముహూర్తాలు లేవు. ఈ ముహుర్తాలు దాటితే ఫిబ్రవరి వరకూ మంచి ముహూర్తాలు లేవని పురోహితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈనెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు దాదాపు రెండున్నర మాసాల వరకు శుక్రమూఢం ఉంది. ఈ సమయంలో వివాహాలు జరిపేందుకు మంచిది కాదు. తిరిగి మాఘమాసంలో దివ్యమైన ముహుర్తాలు ఉన్న రోజుల్లో శుభకార్యాలు జిల్లాలో పెద్దఎత్తున జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు మంచి రోజులు కాగా, ఉగాది పండుగ తర్వాత వరుసగా మంచి రోజులు ఉంటాయని పురోహితులు పేర్కొంటున్నారు. వరుస ముహూర్తాలు, వందలాది పెళ్లిళ్లు ఉండటంతో జిల్లాలో దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పెళ్లిళ్లకు అవసరమైన వస్తుసామాగ్రిని కొనుగోలు చేసేందుకు గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు వస్తుండటంతో దుకాణాల్లో రద్దీ నెలకొంది. వివాహాన్ని జరిపేందుకు పురోహితులు ప్రధానం కావడంతో వారికి ఈ వారం రోజుల పాటు గిరాకీ పెరిగింది. గ్రామాల్లో పురోహితులు ఒకేరోజు మూడు పెళ్లిళ్లు చేస్తుండగా.. పలుచోట్ల ఇద్దరు, ముగ్గురు పురోహితులు కలిసి వివాహాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో పెళ్లి సందడి నెలకొనడంతో ఆయా ప్రాంతాల్లోని కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలో, పాల్వంచ, భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరు తదితర ప్రాంతాల్లో అన్ని హంగులతో కూడిన కల్యాణ మండపాలు సుమారు 50వరకు ఉన్నాయి. అలంకరణలు, ఆర్భాటాలు, ఫంక్షన్‌హాల్ సామాగ్రి, విద్యుత్ వినియోగం, తేదీ ప్రాధాన్యాన్ని బట్టి ఒక్కో వివాహానికి రూ.60వేల నుంచి రూ.1.50 లక్షల వరకు కల్యాణ మండప నిర్వాహకులు చెబుతున్నారు. చిన్నచిన్న ఫంక్షన్‌హాల్స్, ఆలయాల్లో మండపాలు, కమ్యూనిటీహాల్స్‌కు కూడా గిరాకీ పెరగడం విశేషం. పెద్ద సంఖ్యలో జిల్లాలో వివాహాలు జరుగుతుండటంతో వివాహానికి అవసరమైన క్యాటరింగ్, ఫోటో వీడియో, టెంట్‌హౌజ్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఒక్కసారిగా పెళ్లి ముహూర్తాలు ముంచుకు రావడంతో అన్ని ధరలపై ప్రభావం పడింది. సాధారణంగా ఒక పెళ్లికి రూ.10వేలు తీసుకునే బ్యాండ్, డీజే నిర్వాహకులు ఈనెల అధికంగా పెళ్లి ముహూర్తాలు ఉండటంతో రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ధర పెంచేశారు. కాగా శుభముహూర్తాల పుణ్యమా అని ఆర్టీసీ బస్సులు , ట్రావెల్స్ కార్లు కూడా బీజీ అయిపోయాయి.