ఖమ్మం

నగదు బదిలీని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం రూరల్, నవంబర్ 23: నగదు బదిలీ పథకాన్ని రద్దుచేసి రేషన్ షాపుల ద్వారా 14 రకాల సరుకులను సరఫరా చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జాటోతు కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని రేగళ్లతండాలో వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జాటోతు కృష్ణ మాట్లాడుతూ బంగారు తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు మరింత దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగి కూలీ పనులు దొరకక సామాన్య ప్రజలు వలసలు పోతుంటే పట్టించుకోని ప్రభుత్వం రేషన్ దుకాణాలను రద్దుచేసి పేదల జీవితాలతో చెలగాటమాడటం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జిఎస్‌టితో నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు పెరిగి మద్య తరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తునికాకు బోనస్‌ను తక్షణమే చెల్లించాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు చెల్లించాలని, కెటిపిఎస్‌లో సిఎస్‌ఆర్ పాలసీ విధులను రేగళ్ల ప్రాంతంలోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు నల్లమల సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు తేజావత్ వెంకన్న, వాల్యా, నాగేశ్వరరావు, కుంజా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
26 నుంచి జిల్లా స్థాయి చెకుముకి పోటీలు
లక్ష్మీదేవిపల్లి, నవంబర్ 23: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి పోటీలను ఈనెల 26వ తేదీన పాల్వంచలోని సాంఘీక సంక్షేమ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల, పట్టణ స్థాయిలో విజేతలైన 240 పాఠశాలలకు చెందిన విద్యార్ధులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. డిసెంబర్ 8,9 తేదీల్లో కొత్తగూడెంలోని భారత్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలను విజయవంతం చేసేందుకు విద్యార్థులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జనవిజ్ఞాన వేదిక నాయకుల కస్తూరి, నర్శింహారావు, రాధాకృష్ణ, ప్రభుసింగ్ తదితరులు పాల్గొన్నారు