ఖమ్మం

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకులపల్లి, నవంబర్ 23: మండలప పరిధిలోని బేతంపూడి పంచాయతీ 9వ మైలుతండాకు చెందిన నూనావత్ భావ్‌సింగ్ (52) అనే రైతు అప్పులబాధ తాళలేక పురుగు మందు తాగి బుధవారం రాత్రి మృతి చెం దాడు. కుటుంబ సభ్యుల కథనం ప్ర కారం.. ఈ ఏడాది భావ్‌సింగ్ తనకున్న సొంత భూమి 3 ఎకరాల్లో పత్తి, దానికి తోడు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేశాడు. నకిలీ పత్తి విత్తనాల కారణంగా పత్తి ఏపుగా పెరిగి కాత లేకపోవటంతో దిగుబడులు తగ్తే పరిస్థితి ఉందని కొద్ది రోజులుగా భావ్‌సింగ్ మనోవ్యధకు గురవుతున్నాడు. ఈనేపథ్యంలో బుధవారం పంట పొలంలో ఉన్న పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భౌతికకాయాన్ని న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ నాయకులు గురువారం సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఇల్లందు-కొత్తగూడెం ప్ర ధాన రహదారిపై రైతు మృత దేహంతో నాయకులు రాస్తారోకో నిర్వహించా రు. ఈసందర్భంగా నాయకులు మా ట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడిన మృ తుడు భావ్‌సింగ్ కుటుంబానికి రూ. 15లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమలో న్యూడెమక్రసీ రాష్ట్ర కార్యదర్శి మధు, గణితి కోటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు భూక్యా దళ్‌సింగ్ నాయక్, బానోతు హరిప్రియ, బండ్ల శ్రీనివాసరావు, బానోతు హరిసింగ్, బండ్ల రజని తదితరులు పాల్గొన్నారు.
చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలి
ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 23: ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌రూమ్ పథకం తదితర సమస్యలపై కెవిపిఎస్ ఆధ్వర్యంలో 27న నిర్వహించనున్న ఛలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు భీమయ్య పిలుపునిచ్చారు. గురువారం సంఘ కార్యాలయంలో జరిగిన ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు కోటి ఆశలు కల్పించి నీరుగార్చిందన్నారు. దళితులకు మూడెకరాల భూమ, స్వయం ఉపాధి రుణాలు, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు వంటి హామీలు అమలు జరగలేదన్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల కొరకు సుమారు 18వేల మంది దళితులు ఆన్‌లైన్ చేసుకుంటే కేవలం 1325మందిని మాత్రమే సెలక్ట్ చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. లాటరీ ద్వారా సెలక్ట్ అయిన వారికి కూడా నేటి వరకు ఏ ఒక్కరికి లోన్ ఇవ్వలేదన్నారు. ఖమ్మం నగరంలో దళితులు గత మూడు సంవత్సరాలుగా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకొని సెలక్ట్ అయిన వారు కార్పొరేషన్ చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నప్పటికీ రుణాలు మంజూరు చేయలేదన్నారు. కార్పొరేషన్ నిర్వాకం, అధికారుల నిర్లక్ష్యంపై ఈ నెల 27న నిర్వహించనున్న ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో దళితులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు చిరంజీవి, శాంతయ్య, మధు, వెంకన్న, సత్యం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.