ఖమ్మం

ఆందోళన కలిగిస్తున్న కోడిగుడ్డు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, నవంబర్ 23: మద్యాహ్న భోజన కార్మికులపై పెరుగుతున్న ధరలతో ఆర్థికభారం పడుతోంది. విద్యార్థులకు భోజనం పెట్టేందుకు కార్మికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అ మలు చేసేందుకు ఇస్తున్న ధరలు చాలీచాలక కార్మికు లు ఇబ్బందులకు గురవతున్నారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని 1439 ప్రభుత్వ పాఠశాలల్లో 81637 మంది విద్యార్థులకు భోజన సదుపాయాన్ని ఏ ర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 2225 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్నారు. నిత్యావసర ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో మధ్యాహ్న భోజనం తయారీ భారంగా మారినట్లు కార్మికులు ఆందోళనకు గురవతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు రూ 4.13 పైసలతో రోజువారీ భోజనాన్ని వడ్డించాల్సి ఉండగా, కోడిగుడ్డుకు అదనంగా రూ.4లను ప్రభుత్వం అందిస్తోంది. ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు రూ.8.18పైసలతో కోడిగుడ్డుతో అందించాల్సి ఉండటంతో ఇటీవల కోడిగుడ్డు ధర రూ.7.50ల నుంచి రూ.8లు వరకు హోల్‌సేల్‌గా విక్రయిస్తుండటంతో విద్యార్థులకు కోడిగుడ్డును అందించటం భారంగా మారిందని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట చెరకు భారంగా మారటం, గ్యాస్ ధరలు సైతం నెలనెలా పెరుగుతుండటంతో తమపై ఆర్థికభారం పడుతోందని మధ్యాహ్న భోజన కార్మికులు పేర్కొంటున్నారు. గత మూడు నెలలుగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు అందకపోవటంతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరుగుతున్నాయి. టమాట కిలో రూ.50లు, కందిపప్పు ధర రూ.90లు వరకు డిమాండ్ ఉండటంతో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించలేక పోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా మద్యాహ్న భోజన పథకం మెనూ చార్జీలను పెంచాలని మధ్యాహ్న భో జన కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.