ఖమ్మం

విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, నవంబర్ 23: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకటరావు అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వంటశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే శాశ్వత వంటశాల నిర్మాణానికి మూడెకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పదివేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని, వారికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. వంటశాల నిర్మాణానికి రూ.7.50కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ కొత్తగూడెం వంటి ప్రాంతానికి అక్షయ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. వరంగల్, హైద్రాబాద్ వంటి నగరాల్లో ఫౌండేషన్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అధికశాతం గిరిజనులు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్యక్రమాల నిర్వహణకు అక్షయ ఫౌండేషన్ నిర్వాహకులను తీసుకొచ్చిన కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావును అభినందించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యగౌరవచంద్ర మాట్లాడుతూ దేశంలోని 13 రాష్ట్రాల్లో అధునాతన వంటశాలలో 13839 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 16.6లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 808 పాఠశాలల్లో 97269 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నామని అన్నారు. నవభారత్ యాజమాన్యం సహకారంతో కొత్తగూడెంలో వంటశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షయ ఫౌండేషన్ నిర్వాహకులు శోబూ యార్లగడ్డ, మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత, జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు, ఎంపీపీ బానోతు కేస్లీ, సర్పంచ్ వశ్యానాయక్, జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.

డీసీసీబీ ఉపాధ్యక్ష పదవికి బాగం రాజీనామా

ఖమ్మం, నవంబర్ 23: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్ష పదవికి సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు రాజీనామా చేశారు. నాలుగున్నరేళ్ళ క్రితం డిసిసిబి ఎన్నికల్లో తెలుగుదేశం, సిపిఐ కలిసి పోటీ చేయగా పొత్తుల భాగంగా ఆయనకు ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. అయితే గత కొంతకాలంగా డిసిసిబిలో జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెంది ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. డిసిసిబి నిధులను రైతు సంక్షేమ నిధికి మార్చడం, ఆసుపత్రి ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన వాటికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగానే పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా డిసిసిబిలో అన్ని పదవుల నుంచి ఆయన వైదొలుగుతున్నారు. డిసిసిబిలో జరుగుతున్న అక్రమాలపై పోరాటం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.