ఖమ్మం

కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార సంఘాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోనకల్, ఏప్రిల్ 17: కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార సంఘ బ్యాంకులను అభివృద్ధి చేస్తామని డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అన్నారు. మండల పరిధిలోని కలకోట గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నాలుగు లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంటన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అన్ని రుణాలను అందిస్తున్నామన్నారు. ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, గోల్డ్ రుణాలు, పంట రుణాలు, ఈ ఏడాది ఎక్కువగా ఇచ్చిన ఘనత సహకార బ్యాంకులకే దక్కుతుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.