ఖమ్మం

బెంచ్‌ప్రెస్, బాడీబిల్డింగ్ పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 17: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఆదివారం రాష్టస్థ్రాయి బెంచ్‌ప్రెస్, బాడీబిల్డింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా డిప్యూటీ తహశీల్దార్ పి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సాల్మన్‌రాజ్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. యువత చెడుమార్గాలకు ఆకర్షితులు కాకుండా ఈ క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిస్తే రైల్వే, టెలికాం, పోస్టల్ వంటి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీ మల్లేశ్, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ మన్నన్, ఛైర్మన్ కృష్ణారావు, కోశాధికారి జి.వి.రామిరెడ్డి, ఉపాధ్యక్షులు మల్లెల వీరనారాయణ, బాడీ బిల్డింగ్ సంయుక్త కార్యదర్శి రాము,ప్రముఖ వ్యాపారవేత్త బోగాల వీరారెడ్డి, కొనకంచి శ్రీనివాస్, చారి, వికాస్, శివరామ్, బాలరాజు, వెంకటరమణ, శ్యాం, రామకృష్ణ, సురేశ్, సర్వేశ్వరరావు, క్రాంతి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.