ఖమ్మం

యువజనోత్సవాలకు దరఖాస్తు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, డిసెంబర్ 11: జిల్లాలో జరిగే యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో ఎస్.రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21న కొత్తగూడెంలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నారని, అందుకు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లోపు యువతీ యువకులు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జానపద నృత్యం, జానపద గేయం, ఏకాంకిత, హిందూస్థానీ, కర్ణాటక సంగీతం, సంగీత వాయిద్యాలు, హర్మోనియం, గిటార్, క్లాసికల్ డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉందన్నారు. ఈనెల 19వ తేదీలోపు జిల్లా యువజన క్రీడాశాఖకు దరఖాస్తు చేసుకోవాలని, మిగతా వివరాలకు ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
దర్బార్‌లో సమయపాలన పాటించాలి
భద్రాచలం టౌన్, డిసెంబర్ 11: ప్రతి సోమవారం ఐటీడీఏలో నిర్వహించే ప్రజావాణి గిరిజన దర్బార్‌కు సమయపాలన పాటించి యూనిట్ అధికారులంతా తప్పక హాజరు కావాలని ఏపీవో జనరల్ కె.్భమ్‌రావు, గిరిజన సంక్షేమశాఖ డీడీ రామ్మూర్తి సూచించారు. ఐటీడీఏలో సోమవారం యూనిట్ అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన దర్బార్‌లో వారు మాట్లాడారు. దర్బార్‌లో అందజేసే దరఖాస్తులను పరిష్కరించే దిశగా అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు గిరిజనులకు చేరువ చేయడంలో యూనిట్ అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని, సమయపాలనతో విధులకు హాజరు కావాలని ఆదేశించారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా కార్యాలయాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. అనంతరం దర్బార్‌లో ప్రజల నుంచి విద్య, వైద్యం, వ్యవసాయం, పోడు భూములు, ట్రైకార్, విద్యుత్ తదితర సమస్యలపై 90 దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ వెంకటేశ్వర్లు, ఏపీవో పవర్ అనురాధ, ఏడీ అగ్రికల్చర్ సుజాత, ఏపీడీ ఐకేపీ జయశ్రీ, ఇంజనీరింగ్ అధికారి నాగభూషణం, ఈజీఎస్ అధికారి బలరాం, యూనిట్ అధికారులు పాల్గొన్నారు.