ఖమ్మం

గ్రంథాలయంలో విద్యార్థులకు పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, డిసెంబర్ 11: భద్రాచలం పట్టణంలోని తాతగుడి సెంటర్‌లో ఉన్న గ్రంథాలయంలో తెలుగు మహాసభలను పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులకు వ్యసరచన పోటీలు నిర్వహించారు. తెలుగు పండుగలు, వాటి ప్రాముఖ్యత అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో లిటిల్‌ఫ్లవర్స్ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మామిడి పుల్లారావు మాట్లాడుతూ మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలను ప్రపంచానికి తెలిపేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారని అన్నారు. అమ్మపెట్టే గోరుముద్దల కమ్మదనం, తెలుగుభాషలోని తియ్యదనం మరుపు రానిదని ఆయన అన్నారు. ఈ గ్రంథాలయంలో అందరికీ కావాల్సిన పుస్తకాలు ఉన్నాయని, పుస్తకాలు చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో మారిబోయిన సాయిబాబా, ఇందుమతి, శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీరామ కల్యాణం
భద్రాచలం టౌన్, డిసెంబర్ 11: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం స్వామివారు ముత్తంగి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో చూడముచ్చడగా సాక్షాత్కరించిన రామయ్యను కనులారా వీక్షించిన భక్తజనం ప్రణమిల్లారు. జై శ్రీరామ్ అంటూ నీరాజనాలు పలికి ఆరాధించారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతులైన దేవదేవుడు సుందరంగా కనిపించి పరమానంద భరితులను చేశాడు. ప్రధానాలయంలో మూలమూర్తులకు సుప్రభాతం పలికి ఆరాధన జరిపి అర్చకులు నామార్చనలు చేశారు. క్షేత్ర విశిష్టతను వైదిక పెద్దలు ప్రవచనం చేశారు. దర్బారుసేవలో ఆలపించిన కీర్తనలు మంత్రముగ్ధులను చేశాయి.
నేడు కవులకు సన్మాన కార్యక్రమం
భద్రాచలం టౌన్, డిసెంబర్ 11: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ లో భాగంగా భద్రాచలంలోని ఆంజనేయస్వామి పార్కు వద్ద నేడు(మంగళవారం) సాంస్కృతిక కార్యక్రమాలతో పా టు కవులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో శివనారాయణరెడ్డి తె లిపారు. తన కార్యాలయంలో ఈ కార్యక్రమంపై ఆయన సోమవారం అధికారులతో చర్చించారు. తెలుగు మహాసభల కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. తెలుగు భాష అభివృద్ధిలో తెలంగాణ ప్రాంత కవుల పాత్ర ఎంతో విశిష్టమైందన్నారు. తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మనమంతా ముందుకొచ్చి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తహసిల్దార్ రామకృష్ణ, ఐటీసీ సంస్థ డీజీఎం నిరంజన్, ఆర్‌ఐ గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.