ఖమ్మం

టేకులపల్లి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, డిసెంబర్ 14: భద్రాది కొత్తగూడెం జిల్లా టేకులపల్లి,గుండాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని, దీనిపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా నాయకులు జడ సత్యనారాయణ, జి.సక్రు సంయుక్తంగా డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీపీఐ(ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి వర్గానికి చెందిన ఏడుగురు విప్లవ యోధులను పాశవికంగా హతమార్చి ఎన్‌కౌంటర్ రంగుపులిమారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని, ఏడుగురు విప్లవ యోధులను హతమార్చి ప్రభుత్వం తమ నియంతృత్వ నైజాన్ని ప్రదర్శించిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తూ నిజాం నవాబును మరపిస్తున్నారని, దనే్నవాడికే భూమి, పేదలకు భుక్తి, విముక్తి పోరాటాలు నిర్వహిస్తున్న ఉద్యమ కారులను ఎన్‌కౌంటర్ల పేర్లతో కిరాతకం హతమార్చుతున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఇకనైన తమ విధానం మార్చుకోక పోతే ప్రజలే తగిన గుణపాఠం చేప్పుతారని వారు హెచ్చరించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపి, సంఘటనకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ, సక్రు డిమాండ్ చేశారు.

తెలుగు మహాసభలు విజయవంతం కావాలి
కొణిజర్ల, డిసెంబర్ 14: హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావాలని స్థానిక ఎంపిపి వడ్లమూడి ఉమారాణి ఆకాంక్షించారు. సభలు విజయవంతం కావాలని కోరుతూ గురువారం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణలో జరగటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మండలంలో జిల్లా పరిషత్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో నిర్వహించారు. దాశరధి రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, బమ్మెర పోతన, యోగి వేమన, చిందు ఎల్లమ్మ, పాతూరి సోమన, తెలుగు తల్లి, బండారు అచ్చమాంబ తదితరుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మన్సిపల్ కార్పోరేషన్ కౌన్సిలర్ పగడాల నాగరాజు, గ్రామ సర్పంచ్ మేడ లక్ష్మయ్య, ఎంపిటిసిలు నాగలక్ష్మి, లలిత, తహశీల్దార్ శైలజ, ఎంపిడిఓ శ్రీనివాసరావు, ఎంఇఓ శ్యాంసన్, ఇఓఆర్డీ జమలారెడ్డి, ఉపాధ్యాయులు విష్ణుమూర్తి, పిడి శ్రీనివాస్, తిరపతయ్య, రామారావుతదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఎన్నిక
చండ్రుగొండ, డిసెంబర్ 14: ఎస్‌ఎఫ్‌ఐ మండల నూతన కమిటీ ఎన్నిక గురువారం చండ్రుగొండలో జరిగింది. అధ్యక్షుడిగా బొమ్మగాని శ్రావణ్, కార్యదర్శిగా కంభంపాటి రవితేజ ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో కార్యదర్శి రవితేజ మాట్లాడుతూ చండ్రుగొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, పేద విద్యార్ధులు పోటి పరీక్షలకు సిద్ధమయ్యేందుకు లైబ్రరీని ఆధునీకరించాలని కోరారు. ప్రభుత్వ వసతి గృహాల్లో వౌలిక వసతులు మెరుగుపరచాలని అన్నారు. స్థానిక జిల్లాపరిషత్, ప్రాధమిక పాఠశాలల్లో చిన్నపాటి వర్షానికే ప్రాంగణం నీటితో నిండుతుందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు, త్రాగునీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని రవితేజ కోరారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు దివ్య, చిన్న ఉపేంద్ర, గణేష్, వీరబాబు, భాను, ప్రసాద్, రుక్మాందరావుతదితరులు పాల్గొన్నారు.