ఖమ్మం

ధనుర్మాసోత్సవాలకు శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, డిసెంబర్ 14: ప్రసిద్ధిగాంచిన గార్ల శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో ఈనెల 16నుంచి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు పూర్తి చేశారు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో పవిత్ర ధనుర్మాసవత్రం ఆరంభం అవటం, ‘మాసానాం మార్గశిరోహం మాసాల్లో మార్గశిర మాసాన్ని నేను’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించారని ఆయనను స్మరించుకుంటూ ధనుర్మాసాత్సోవాలను నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. గోదాదేవి శ్రీకృష్ణుడిని పొందటం కోసం ఈ మాసంలో తిరుప్పావై వ్రతాన్ని (్ధనుర్మాస వ్రతం) ఆచరించటం వల్ల ముక్తి మార్గం లభించాలని, సిరి సంపదలు కలగాలని, కన్యలకు కళ్యాణ మస్తులు కలగాలని ధూప దీపాలతో పూజలు నిర్వహిస్తారు. అరుదుగా ఉండే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల నడిబొడ్డున ఉన్న గార్ల శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. గార్ల గాంధీ పార్కు సమీపంలో శ్రీ వెంకటేశ్వరస్వామిని ప్రతిష్టించేందుకు దేవాలయాన్ని నిర్మించగా నాటి ఆలయ పూజారి కలలో స్వామి వచ్చి విముఖత వ్యక్తం చేశారని ఈ విషయాన్ని పూజారి స్థానిక ప్రముఖలకు తెలపటంతో ప్రతిష్ట నిలిపారట. దీంతో కొనే్నళ్ళ పాటు ఆలయం ఖాళీగా ఉండి పోయింది. ఇదే సమయంలో గార్ల మెయిన్ రోడ్డులో యాదవ కులానికి చెందిన భక్తురాలు బంకుమల్లమ్మ గృహ నిర్మాణానికి పూను కోగా ఆ త్రవ్వకాల్లో సుందర దేవత విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటిని శ్రీలక్ష్మీనారాయణ స్వామి, ఆళ్వారులుగా గుర్తించి స్థానిక పూజారి కాండూరి నర్సింహచార్యులు ఇంటి వద్ద ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించటం ఆరంభించారు. కొంత కాలం తర్వాత స్థానికులంతా సమావేశమై వెంకటేశ్వర స్వామి కోసం నిర్మించిన ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామి, గోదాదేవి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించాలని నిర్ణయించారు. ఈ ప్రతిష్టాపనకు స్థానిక ప్రముఖులు మాటేటి వరవరరావు నడుం బిగించారు. అనంతరం నర్సింహాచార్యులు స్థానికుల నుంచి విరాళాలు సేకరించి లక్ష్మీనారాయణ స్వామి, భూదేవి, నీలాదేవి ఉత్సవ విగ్రహాలను తెప్పించి ప్రతిష్టించారు. కొనే్నళ్ళ తర్వాత దేవాలయ బాగోగులు పట్టించుకోక పోవటంతో శిథిలావస్థకు చేరుకోగా దేవాలయాన్ని గార్ల వర్తక వ్యాపార ప్రముఖుడు పుల్లఖండం సత్యనారాయణ కృషితో ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మార్గశిర మాసంలో ధనుర్మాసోత్సవాలు, పూజా కార్యక్రమాలు చేస్తూ భోగి రోజున గోదా దేవి కళ్యాణం, చైత్ర శుద్ధ చతుర్ధశి నాడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం, ఉగాది నాడు పంచాంగ శ్రవణం, శ్రావణ మాసంలో గోదాలక్ష్మీకి లక్ష కుంకుమార్చనలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ధనుర్మాసోత్సవ నిత్యనిధి కార్యక్రమాలతో పాటు ఈనెల 16న ధనుర్మాస ఆరంభ హనుమాన్ చాలీసా, తీర్థప్రసాద వినియోగం, 28న హనుమాన్ చాలీసా, 29న ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, 30న ద్వాదశి పార్వాణ, అన్నప్రసాద వినియోగం, జనవరి 1న ఆంగ్ల సంవత్సరాధి సందర్భంగా ప్రత్యేక పూజలు, 5న గోదాదేవి అమ్మ వారికి మహిళలచే సామూహిక లక్ష లక్ష్మీ కుంకుమార్చన, 8న గోదాదేవి అమ్మవారికి దీపోత్సవం, 11న గోదాదేవి అమ్మవారికి కూ డారై ఉత్సవం 108గంగాళలతో, 13న పరమ పదోత్సవం, 14న ఉదయం 11గంటలకు గోదారంగనాధుల కళ్యామహోత్సవం, 15న మకర సంక్రాంతి ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ వంశపరంపర్య అర్చకులు కాండూరి లక్ష్మీనారాయణచార్యులు తెలిపారు. ఇందుకై ఆలయాన్ని స ర్వాంగ సుందరం తీర్చిదిద్దామన్నారు.
జంగీ బంగీ ఏక్ నహీ.. బంజారా ఎస్టీ నహీ
భద్రాచలం టౌన్, డిసెంబర్ 14: శంఖారావ సభలో జంగీ బంగీ భాయి భాయి అని బంజారాలు ప్రకటించడాన్ని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య ఖండించారు. బంజారాలు పేర్కొంది సరైంది కాదని జంగీ బంగీ ఏక్ నహీ.. బంజారా ఎస్టీ నీహీ అని ఆయన అన్నారు. భద్రాచలంలో గురువారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గోండ్వానా భూభాగంలో మ హారాష్ట్ర నుంచి బంజారాల వలసలు పెరగడంతో అ ప్పటి నిజాం ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల నియంత్రణ చట్టం 1946ను రూపొందించిందని, హైదరాబా ద్ ట్రైబల్ ఏరియాస్ యాక్ట్-1949ని కూడా రూపొందించారని గుర్తు చేశారు. నిజాం కాలంలో తెలంగాణ భూభాగంలో గోండులు, కోయలను దృష్టిలో ఉంచుకొని నిజాం ప్రభుత్వం ట్రైబల్ ఏరియా రెగ్యులేషన్ యాక్ట్‌ను రూపొందించిందని, ఆదివాసీ ప్రా ంతాల నియంత్రణ చట్టం బంజారాలకు వర్తించదని ఆయన అన్నారు. నిజాం ప్రభుత్వం జంగ్లీ (ఆదివాసీ), బంగ్లీ (బంజారాలు) అని ఎక్కడా రాయలేదని, కానీ బంజారాలు తమ శంఖారావ సభలో అ వాస్తవాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటీష్, నిజాం హయాంలో గోండులు, కోయలకు కొన్ని రక్షణ చట్టాలు చేశారన్నారు. పోలవరంతో మ న పాలకులు, దోపిడీవర్గాలు గోండులు, కోయలను జలసమాధి చేస్తున్నాయని విమర్శించారు. బంజారాలకు ఎస్టీ హోదా రద్దు కోరుతూ జనవరి 20 నుంచి జీఎస్పీ, జీవీఎస్పీ, జీటీఎఫ్ ఆధ్వర్యంలో గోండ్వానా లాంగ్‌మార్చ్ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సోడె చలపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెల్లం వీరభద్రం, గొగ్గెల నవీన్, సోడె శివ, వర్స సుదర్శన్, ఈక సారంగపాణి, జగదీష్, ఆలం ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు.