ఖమ్మం

గార్ల పాకాల ఏరు చెక్‌డ్యాంను పరిశీలించిన ఎమ్మెల్యే కనకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, డిసెంబర్ 14: గార్ల పాకాల ఏరు చెక్‌డ్యాం కమ్ రోడ్ వేను గురువారం ఇల్లందు నియోజక వర్గ శాసన సభ్యుడు కోరం కనకయ్య సందర్శించి పరిశీలించారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో నర్సంపేట, బయ్యారం, గార్ల పెద్ద చెరువుల నుంచి విడుదలయ్యే వృథాగా వచ్చే వరద నీటితో చెక్‌డ్యాం పూర్తిగా మునిగి పోవటం, మండలం పరిధిలోని రాంపురం, డోర్నకల్, కురవి, మహబూబాబాద్ మండలాలకు చెందిన మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలు నిలిచి పోవటం పరిపాటైంది. పాకాల ఏరు రోడ్‌వే కమ్ చెక్‌డ్యాం ఎత్తును పెంచాలని గతంలో మండలంలోని రాజకీయ పక్షాలు, రాంపురం పంచాయతీ ప్రజలు పలమార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులకు, జిల్లా ఉన్నాతాధికారులకు వినతిపత్రం సమర్పించిన ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ చెక్‌డ్యాం ఎత్తు పెంచేందుకు కృషి చేస్తానని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి నిధుల విడుదల చేయిస్తానని ఎమ్మెల్యే కనకయ్య ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు, ఎంపిపి మాలోతు వెంకట్‌లాల్, జడ్పీటిసి మాధవి, అయా గ్రామపంచాయతీల సర్పంచులు, మండల ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు, టీఆర్‌ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బూటకపు ఎన్‌కౌంటర్ల బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
* మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

కొత్తగూడెం రూరల్, టేకులపల్లి, డిసెంబర్ 14: బూటకపు ఎన్‌కౌంటర్ల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. టేకులపల్లి మండలం మేళ్లమడుగు గ్రామం అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమేనని అన్నారు. ఎన్‌కౌంటర్లో మృతి చెందిన దళ సభ్యులను చూసేందుకు వచ్చిన గుమ్మడిని పోలీసులు అడ్డుకోవటంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూటకపు ఎన్‌కౌంటర్ చేసి ఎదురు కాల్పుల కథలు అల్లే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తన్నారని ఆరోపించారు. ఎటువంటి కేసులు, హింసాత్మక సంఘటనలకు పాల్పడనప్పటికీ ఎనిమిది మందిని దళ సభ్యులను మట్టుబెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మృత దేహాలను చేసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు, వామపక్ష పార్టీల నాయకులను అనుమతించకపోవటం సరైందికాదన్నారు. ఎన్‌కౌంటర్‌లులేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్, పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌పై ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు జడ్పీటిసి చండ్ర అరుణ, జడ సీతారామయ్య, ఆర్‌సిఎస్ బోస్, నాయకులు ప్రసాద్, కినె్నర నర్సయ్య, ఊక్లా, భానుచందర్, ఫృధ్వీ, సారంగపాణి, గణితి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.