ఖమ్మం

గిరిజనుల ఆందోళన బతుకుతెరువు కోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), ఏప్రిల్ 18: జిల్లాలో గిరిజనులు తమ బతుకుతెరువు కోసమే ఆందోళనలు చేస్తున్నారు తప్ప ఫ్యాషన్ కోసం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే సిపియం జిల్లా కమిటి సమావేశాల్లో భాగంగా స్ధానిక సుందరయ్య భవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగాప్రసంగించారు. గిరిజనులు చేస్తున్న ఆందోళనలను ముఖ్యమంత్రి ఫ్యాషన్ కోసం ఉద్యమాలు చేస్తున్నారని బాధ్యతారహితంగా మాట్లాడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ వస్తే ఎక్కువగా లాభం జరిగేది గిరిజనులకే నని పదే పదే ప్రకటనలు చేసిన కెసిఆర్ హరితహారం పేరుతో తాతలనాటి భూములను సైతం ఖాళీ చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖడించారు. కెసిఆర్ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ, తమ బతుకుతెరువు కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో గిరిజనులు పోరాడుతుంటే వారిపై కక్ష్యసాధింపు చర్యలు చేపట్టడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు వచ్చాక దళితులు, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని విమర్శించారు. పట్టాలున్న గిరిజన రైతులను కూడా తమ భూముల్లోకి అనుమతించక పోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పట్టాలతో సంబంధం లేకుండా 2005కు ముందు నుండి సాగుచేస్తున్న గిరిజన రైతులకు ఎటువంటి అవరోధం కల్పించ వద్దన్నారు. లేని పక్షంలో సిపియం ఆధ్వర్యంలో వామపక్షాలతో కలిసి గిరిజనులు సంఘటిత పరిచి పోరాడతామని హెచ్చరించారు. జిల్లాలో కరువుపై సిఎం పరోక్షంగా అంగీకరిస్తున్నప్పటికి మంత్రి తుమ్మల చొరవతీసుకోకపోవడంలో అంతర్యమేమిటో వివరించాలని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధిహామి పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. భూగర్భ జలాలు అందని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారామంచినీటి సరఫరా చేయాలన్నారు. కాసాని ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, మచ్చా వెంకటేశ్వర్లు, పొన్నం వెంకటేశ్వరరావు, ఎజే రమేష్, నున్నా నాగేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, అన్నవరపు కనకయ్య, బత్తుల లెనిన్, డివిజన్ కార్యదర్శి బండి రమేష్, యర్రా శ్రీనివాసరావు, తాతా భాస్కర్‌రావు, కె నాగేశ్వరరావు, ఎ సత్యనారాయణ, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంకు ఔటర్ రింగ్‌రోడ్డు
రూ. 293 కోట్ల నిధులు మంజూరు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఏప్రిల్ 18: ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోనే అతివేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా ఉన్న ఖమ్మంకు ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ఎన్నో ఏళ్ళుగా ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం తమ ప్లీనరికి ముందు మంజూరు చేయటం గమనార్హం. కాగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 293కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఔటర్ రింగ్‌రోడ్డుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియతో పాటు ఇతర పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. ఖమ్మం రూరల్, చింతకాని, రఘునాథపాలెం, ఖమ్మం నగరాన్ని కలుస్తూ ఈ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం జరగనున్నది.