ఖమ్మం

అవకతవకలకు పాల్పడినవారిపై కఠినచర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, జనవరి 12: గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి హమీ పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిఆర్‌డిఏ అదనపుపీడీ బెల్లం ఇందుమతి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఉపాధి హమీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. నవంబర్ 2016 నుండి సెప్టెంబర్ 2017 వరకు మండలంలో 17గ్రామ పంచాయితీలలో 2.73 కోట్ల రూపాయల పనులు నిర్వహించారు. ఈ పనులపై గత వారం రోజుల్లో సామాజిక తనిఖీ సభ్యులు నిర్వహించిన నివేదికలను వినిపించారు. గోవింద్రాల, పొనె్నకల్లు తదితర గ్రామాల్లో క్షేత్రాధికారులు రికార్డుల్లో అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడైంది. అదే విధంగా అన్ని గ్రామాల్లో రికార్డులను పరిశీలించడం జరిగింది. ఈ పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవడంతోపాటు బాధ్యులైన వారి నుండి సొమ్ము రికవరీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆమె చెప్పారు. 11 విడతలుగా జరుగుతున్న సామాజిక తనిఖీల్లో క్షేత్ర అధికారులు తమ విధి నిర్వహణను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి భాను శ్రీ, ఎంపిడివో విజయ, క్వాలిటి కంట్రోల్ అధికారి సూర్యప్రకాష్, ఎంపిపి సరిరాంనాయక్, ఎంఇవో ప్రసాదరావు, ఇవోఆర్‌డి ఉమాకుమారి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

షీ టీమ్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఖమ్మం(జమ్మిబండ), జనవరి 12: షీటీం 2018సంవత్సరం క్యాలెండర్‌ను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారు, మహిళలను వేధిస్తున్న వారిపట్ల షీటీం అప్రమత్తంగా ఉండి వారికి రక్షణ కల్పించాలన్నారు. వేధిపులకు పాల్పడుతున్న వారిని ముందుగానే పసికట్టి వారిపట్ల చర్యలు తీసుకొని సంఘటనలు పునారువృతం కాకుండా గట్టినిఘా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి సురేష్‌కుమార్, ఎసిపిలు గణేష్, ఎఆర్ రహ్మన్, వెంకటేశ్వర్లు, ఖమ్మం కమిషనరేట్ షీటీం ఇంచార్జ్ అంజలి, షీటీం బృందం పాల్గొన్నారు.

భద్రాద్రిలో నేడు విశ్వరూప సేవ
భద్రాచలం టౌన్, జనవరి 12: భద్రాద్రి రామక్షేత్రంలో నేడు విశ్వరూప సేవ జరగనుంది. భద్రాచలంలో తప్ప మరే క్షేత్రంలో జరగని అరుదైన ఉత్సవం ఇది. ఈ సమయంలో ఆలయంలోని ఉత్సవ విగ్రహాలన్నింటినీ ఒకచోట చేర్చి ఏకారాధన చేసే విశేషోత్సవం ఇది. 24 రోజుల పాటు దేవస్థానంలో ఉత్సవాలు జరిగిన అనంతరం 27వ రోజున అంటే.. వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 16వ రోజున ద్వాదశి నాడు (జనవరి 13) భద్రాద్రి రాముని సన్నిధిలో విశ్వరూప సేవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే బహుళ ద్వాదశి ఘడియల్లో ఈ విశ్వరూప సేవ ఆరాధన నిర్వహించడం భద్రాద్రి ఆలయం ప్రత్యేకత. ఈ ఉత్సవ నిర్వహణ కోసం నిత్య కల్యాణ మండప వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రామయ్యకు సమర్పించే ప్రత్యేక ప్రసాదం (కదంబం)కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.