ఖమ్మం

పక్కదారి పడుతున్న నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జనవరి 12: నిధులు లేక గ్రామ పంచాయతీలు నీరసించిపోతున్నాయని సర్పంచ్‌లు ఆవేదన చెందుతుంటే ఉన్న నిధులను కొందరు అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. అక్రమాలకు అడ్డాగా ఉన్న ఖమ్మం జిల్లా వైరా మేజర్ గ్రామ పంచాయతీలో గత కొనే్నళ్ళుగా ప్రజోపయోగ కార్యక్రమాలు జరగకపోగా నిధులు లేవంటూనే వాటిని అక్రమంగా బదలాయించుకుంటున్నారు. ఆ గ్రామ పంచాయతీకి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వస్తున్నా జిల్లాధికారులు కూడా స్పందించడం లేదు. ఇప్పటికే తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, అపరిశుభ్రతలో అగ్రస్థానంలో ఉన్న ఆ గ్రామ పంచాయతీలో కనీసం పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. కానీ గత సెప్టెంబర్ నెలలో గ్రామ పంచాయతీ ఖాతా నుంచి పదిలక్షల రూపాయలు ఓ కిరాణా దుకాణం నడిపే వ్యక్తి ఖాతాలోకి చేరాయి. ఆశ్చర్యకరంగా ఆ నిధులు తన అకౌంట్ నెంబర్ 6361110000228కు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదని, అవి తన డబ్బులు కాదని, దీనిపై విచారణ జరపాలని బ్యాంకు మెనేజర్‌తో పాటు పోలీస్ కమిషనర్‌కు కూడా సదరు కిరాణం దుకాణం యజమాని శ్రీనివాసరావు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా దానిమీద ఏ విచారణ జరిగింది అనేది స్పష్టంగా తెలియడం లేదు. మరోవైపు ఇదే తరహాలో గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తమకివ్వాల్సిన జీతాలివ్వకుండా గ్రామ పంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు చేపట్టకుండా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన కూడా చేశారు. కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో తిష్ట వేసిన అధికారులు ప్రతి ఏడాది అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీనిలో వారి ప్రమేయం కూడా ఉన్నదేమోనని అనుమానించాల్సి వస్తున్నదని ఆ గ్రామంలోని అనేక మంది ఆరోపించడం గమనార్హం.