ఖమ్మం

వివేకానందుడు ఆదర్శనీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జనవరి 12: స్వామివివేకానంద ఆదర్శనీయుడని, ఆయన జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక 34వ డివిజన్ రాపర్తినగర్, ఎల్‌బిస్టేడియంలో జరిగిన వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్ఫూర్తి ప్రదాత వివేకానందుడని కొనియాడారు. దేశ సమైఖ్యత, విద్యార్థులకు స్ఫూర్తిని నింపడంలో ఓ ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. ఆయన ఆలోచనలతో ఎందరికొ మార్గదర్శకంగా ఉంటాయని, తమ వంతు కర్తవ్యంగా సమాజసేవ చేయాలనే సంకల్పంతో ముందుండి నడిపించిన అనేక మందికి దిశనిర్దేశం చేశారని పేర్కొన్నారు. యువతలో సామాజికి చైతన్యం పెంచుకునే విధంగా కార్యచరణ చేసి వారికి బాసటగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దోనేపల్లి శే్వత, కమర్తపు మురళీ, డిఎస్‌ఒ పరంధామరెడ్డి, రామారావు, జక్కుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి ఆధ్వర్యంలో
స్వామివివేకానంద జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా ఇల్లెందు క్రాస్‌రోడ్డు చేరుకొని అక్కడ ఉన్న వివేకానంద విగ్రహానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ్ధర్‌రెడ్డి, నగర కార్యదర్శి రుద్ర ప్రదీప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా యువతకు స్వామివివేకానంద ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఆయన జయంతి రోజున జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వించదగినదన్నారు. వివేకానందుడు బౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన బోధనలు, సూక్తులు సజీవంగా నిలచి ఎందరికో ఆదర్శంగా ఉన్నాయన్నారు. వివేకానందుడు అడుగుజాడల్లో యువత నడుస్తూ దేశాభివృద్దికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కొలపాక శ్రీదేవి, ప్రభాకర్, నాగేందర్, శ్రీనివాస్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
వివేకానంద పాఠశాలలో
నగరంలోని వివేకానంద పాఠశాలలో వివేకానందుడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుడి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ వక్కలంక శారద మాట్లాడుతూ యువత మేలుకో- గమ్యంచేరు వరకు విశ్రమించకు అన్న ఉపనిషత్ శ్లోకాన్ని స్వామివివేకానంద ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. భారతీయ యువతకు వివేకనందుడి మాటలు స్పూర్తిదాయకమన్నారు. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని తమ భవిష్యత్‌కు తీర్చిదిద్దుకోవాలని సూచించారు. వివేకానందుడి రచనలు ఎందరికో మార్గదర్శకంగా నిలవనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆనంద్‌కుమార్, ఉపాధ్యాయులు ఇందిర, నాగేందర్‌ప్రసాద్, రమాదేవి, పరమేశ్వర్, ఉపేందర్, సునీత, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.