ఖమ్మం

త్వరలోనే సీతారామకు అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం/తిరుమలాయపాలెం జనవరి 12: వచ్చే రెండునెలల్లోనే సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తిచేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు, రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. భక్తరామదాసు రెండవ దశను శుక్రవారం ప్రారంభించిన అనంతరం తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఖమ్మంజిల్లా అభివృద్థిలో ఆదర్శంగా ఉండగా సస్యశ్యామలంలో పాలేరు నియోజకవర్గం ఆదర్శంగా మారిందన్నారు. ఒకప్పుడు పాలకుల వ్యవహారశైలి వల్ల కరువుతో అల్లాడిన ఈ ప్రాంతం నేడు నీటితో కళకళలాడుతున్నదన్నారు. మూడురకాలుగా భక్తరామదాసు ప్రాజెక్టు వినియోగంలో ఉంటుందని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. నాగార్జునసాగర్ నీండినా, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు పూర్తయినా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. ఒకవైపు నీరులేకపోయినా మరోవైపు నీటితో దీనిని వినియోగించుకోవచ్చన్నారు. అభివృద్థి అంటే నేర్చుకోవాల్సింది ఖమ్మం జిల్లానుంచేనని ఇక్కడ రోడ్లు, ప్రాజెక్టులు, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు, పార్కులు చూసి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత అతితక్కువ సమయంలోనే భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తిచేశామని, ఇది దేశంలోనే రికార్డుగా మారిందన్నారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఏమి చేయలేకపోయాయని, ఇప్పుడు తాముచేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా, న్యాయస్థానాలను ఆశ్రయించినా ప్రజాసంక్షేమంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును చూసి తాము నేర్చుకుంటున్నామని, ఆయన కూడా ఆయన నియోజకవర్గంలో పనుల కోసం తమవెంట పడ్డారని ప్రజల హర్షధ్వానాల మధ్య హరీష్‌రావు ప్రకటించారు. అంతకు ముందు ప్రాజెక్టు నీటికి పూజలు నిర్వహించిన అనంతరం ఆరుకిలోమీటర్ల మేర కాల్వవెంట పయణించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఈ సభలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా సాగవుతున్న ఆయకట్టు వివరాలతో పాటు జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివరించారు. సభలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, కనకయ్య, మదన్‌లాల్, ఎమ్మెల్సీలు రాజేశ్వరరెడ్డి, లక్ష్మినారాయణ, కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.