ఖమ్మం

మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు మహోన్నత వ్యక్తి అని ఆ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డిగర్ల సుందరం అన్నారు. గురువారం ఎన్టీఆర్ 22వ వర్ధంతిని మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కామేపల్లి, ఊట్కూర్, జాస్తిపల్లి, తాళ్లగూడెం, పండితాపురం తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గాలలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వారు అన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల అన్నదానాలు, ఆటలపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జల్లి రాములు, పుచ్చకాయల సత్యనారాయణ, అజ్మీరా హరినాయక్, ముల్కలపల్లి నాగేశ్వరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ బోర్డు ఏర్పాటుకు కార్మికుల ఎదురు చూపులు
* పదకొండు నెలలుగా వేతనాలు అందక కార్మికుల ఇబ్బందులు * పట్టించుకోని గుర్తింపు కార్మిక సంఘం

కొత్తగూడెం, జనవరి 18: సింగరేణి కార్మికులను మెడికల్ అన్‌ఫిట్ చేసేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24న నిర్వహించిన మెడికల్ బోర్డు సమావేశం ఇంతవరకు మళ్ళీ నిర్వహించకపోవడంతో సింగరేణి వ్యాప్తంగా పదకొండు ఏరియాల్లోని సూమారు 500 మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. మెడికల్ బోర్డు సమావేశం ప్రశ్నార్థకంగా మారింది. మెడికల్ ఫిట్ అవుతామా లేదా అని కార్మికులు అందోళన చెందుతున్న పరిస్థితి సింగరేణిలో నెలకొంది. సింగరేణి మెడికల్ బోర్డులో జరిగన అక్రమాల కారణంగా సింగరేణి అధికారులు, మెడికల్ అధికారులు జంకుతున్న పరిస్థితి ఎదురవుతోంది. మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో కార్మికులు అధిక శాతం మంది కార్మికులు మెడికల్ బోర్డు ఎదుట హాజరయ్యేందుకు ఆస చూపుతుండటంతో దీనిని ఆసరాగా చేసుకున్న కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు మెడికల్ చేయిస్తామంటూ కార్మికుల నుండి పెద్ద ఎత్తున వసూళ్ళకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో మెడికల్ బోర్డులో కోట్లాది రూపాయలు చేతులు మారడం, సింగరేణి విజిలెన్స్ అధికారులు మెడికల్ బోర్డుపై విచారణ జరిపి ఇద్దరు చిరుద్యోగులను విధుల నుండి శాశ్వతంగా తొలగించడం సంచలనం సృష్టించింది. ఉన్నతాధికారులను, కార్మిక సంఘాల నాయకులను వదిలేసిన విజిలెన్స్ అధికారులు చిరు ఉద్యోగులను బలిచేశారని విమర్శలు వచ్చాయి. దీంతో పదకొండు నెలలుగా మెడికల్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నూతన మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మెడికల్ బోర్డు ఏర్పాటుకు చొరవ చూపాలని కార్మికులు కోరుతున్నారు.