ఖమ్మం

టీఎస్‌కాప్‌లో నేరస్థుల వివరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జనవరి 18: తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌శాఖ ఆదేశాలతో గురువారం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నేరస్థుల సమగ్ర సర్వే వివరాలను టిఎస్ కాప్‌లో పొందుపరచనున్నట్లు ఖమ్మం అదనపు డీసీపీ కె సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కల్లూరు చేరుకున్న ఆయన కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్, సత్తుపల్లి రూరల్ సిఐ మడతా రమేష్, కల్లూరు ఎస్‌ఐ పవన్‌కుమార్‌తో నేరారోపణలున్న వారి ఇంటికి వెళ్లి వారి సమాచారాన్ని సేకరించారు. అనంతరం డీసీపీ విలేఖరులతో మాట్లాడుతూ వృత్తి పరంగా నేరాలు చేసేవారిని, నేరస్తులుగా ఆరోపణలున్న వారిని టిఎస్ కాప్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో నేరస్తుల సమాచారాన్ని సులభంగా పసిగట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎస్‌ఐ శ్రీకాంత్ ఉన్నారు.

నేరాల నిరోధానికే సమగ్ర సర్వే
ఏన్కూరు, జనవరి 18: గ్రామాల్లో జరుగుతున్న నేరాలను నిరోదించేందుకే నేరస్తులపై సమగ్ర సర్వే నిర్వహించటం జరుగుతుందని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. పోలీస్ శాఖ ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని నాచారం, రేపల్లెవాడ, ఒంటిగుడిసె, ఏన్కూరు, టిఎల్‌పేట, హిమామ్‌నగర్, బిఎన్ తండా తదితర గ్రామాలలో సిబ్బందితో కలిసి గురువారం పాత నేరస్తులపై సమగ్ర సర్వే నిర్వహించారు. గత పది సంవత్సరాల క్రితం నేరాలకు పాల్పడిన వారి రికార్డులు బయటకు తీసి గ్రామల్లోకి వెళ్లి వారి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. వారి ఆదార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, కుటుంబ వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చటం జరుగుతుందని తెలిపారు. ఈవిదానంతో గ్రామాల్లో ఎక్కడ ఏమి జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకోవటానికి సులువుగా ఉంటుందని, నేరాలు జరగకుండా పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

సత్తుపల్లిలోనేరస్థుల సమగ్రసర్వే
సత్తుపల్లి, జనవరి 18: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేరస్తుల జాభితాను పొందుపరిచేందుకు పోలీసుశాఖ చేపట్టిన నేరస్తుల సమగ్రసర్వే ను గురువారం సత్తుపల్లి పోలీసులు నేరస్తుల జాభితా సేకరణ కార్యక్రమం చేపట్టారు. సత్తుపల్లి పట్టణ సీఐ వెంకట నర్సయ్య ఆధ్వర్యంలో 10టీమ్‌లను ఏర్పాటు చేసి కాకర్లపల్లి గ్రామంలో జాభితా సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇప్పటి వరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరువందల మంది పాత నేరస్తులను గుర్తించామని వారి వివరాలను సేకరించినట్లు చెప్పారు.