ఖమ్మం

నిమిషానికో జెండాపాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 18: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి పంటకు రెక్కలు వస్తుండటంతో ఇంత కాలం కొల్డ్‌స్టోరేజిలలో మగ్గిన మిర్చి బస్తాలు ఒక్కసారిగా మార్కెట్‌కు రావటంతో ఖరీదుదారులు నిమిషానికో జెండాపాట ప్రకటనతో మార్కెట్ గందరగోళం నెలకొంది. ప్రస్తుతం మార్కెట్‌లో మిర్చి ధర 9,200నుండి 9,600వరకు ధర పలుకుతుండటంతో మిర్చి రైతులు ఇంత కాలం దాచుకున్న మిర్చి బస్తాలను మార్కెట్‌లో అమ్ముకునేందుకు తీసుకువచ్చారు. దీంతో ఖరీదుదారులు జెండాపాటను నిమిషా నిమిషానికి మారుస్తు రైతులను అయోమయంలో పడేశారు. దీంతో మిర్చి రైతులు నివ్వెరపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్‌లో మిర్చి ధరకు రోజురోజుకు ధర పెరుగుతుండటంతో మిర్చి పంటను అమ్ముకునేందుకు రైతులు పంటలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం 10,570మిర్చి బస్తాలు మార్కెట్‌కు చేరాయి. దీంతో ఎక్కువ ధరను చెల్లించాల్సి వస్తుందని భావించిన ఖరీదుదారులు జెండాపాటతో అయోమయానికి గురిచేస్తు రైతులను మోసం చేసినట్లు తెలుస్తొంది. దీనిపై అధికారులు సైతం పట్టించుకోవటం లేదని రైతులు ఆరోపించటం గమనార్హం.

ఘనంగా ఎన్టీఆర్ వర్దంతి
* రక్తదానం, అన్నదానం చేసిన పార్టీ శ్రేణులు
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 18: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని టిడిపి కార్యాలయం, ఎన్టీఆర్ సర్కిల్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రాస్ట్ లెంజెండరి బ్లడ్ డోనేషన్ డ్రైవ్‌ను స్థానిక టిడిపి కార్యాలయంతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకవీరయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలగుజాతి కీర్తి, ప్రఖ్యాతులు సాదించటానికి ప్రత్యేక చొరవ చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వార్గల అభివృద్ధికి, ప్రతి పేదవాడికి కడుపునిండ అన్నం పెట్టేందుకు 2రూపాయలకే కిలో బియ్యం, సమాజంలో ఉన్న పేదరికాన్ని నిర్ములించేందుకు, జనత వస్తల్రు వంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పటేల్, పట్వరి వ్యవస్థను రూపుమాపిన వ్యక్తిగా ఎన్టీఆర్ నిలిచారన్నారు. అలాగే రాజకీయంలో వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించి, మండల వ్యవస్థను తీసుకవచ్చి పేదవాడి గురించి మొట్టమొదటి సారిగా అలోచించిన వ్యక్తిగా ఎన్టీఆర్ నిలిచారన్నారు. అనంతరం 22, 45,46,47డివిజన్‌లలో అన్నదానం, ప్రభుత్వసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించి, రక్తదాన చేసిన రక్తదాతలకు ఎన్టీఆర్ ట్రాస్ట్ ద్వారా దృవపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి, కూరపాటి వెంకటేశ్వర్లు, ఎలూరి శ్రీనివాసరావు, గంగధర్‌చౌదరి, వెంకట్రామయ్య, మాధవరావు, సుమంత్, తోటకూరి శివయ్య, మీగడ రామారావు, గొల్లపూడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.