ఖమ్మం

రికార్డు స్థాయలో సకల నేరస్థుల సమగ్ర సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం పాత నేరస్థుల వివరాలను సేకరించి నేరాలను అదుపు చేసే చర్యలను చేపట్టింది. గతంలో సకల జనుల సర్వే నిర్వహించి రికార్డును సాధించింది. భూ ప్రక్షాళన పేరుతో భూసర్వే చేపట్టి భూ వివరాలను రికార్డులో నిక్షిప్తం చేసింది. అదే తరహాలో పాత నేరస్థుల వివరాలను కూడా సేకరించి వాటిని జియోట్యాగింగ్ ద్వారా నిక్షిప్తం చేసి నేరం జరిగిన వెంటనే నేరస్థులను కనుగొనేందుకు ఈ సర్వేని చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం ఖమ్మం జిల్లాలో సకల నేరస్థుల సమగ్ర సర్వేలో జిల్లా పోలీస్ యంత్రాంగం పాల్గొని వివరాలను సేకరించింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజాభద్రత, నేరరహిత సమాజమే ప్రధాన లక్ష్యంగా సకల నేరస్థుల సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదేపదే దొంగతనాలు, దోపిడీలు, చేసే నేరగాళ్ళ వివరాలు, చిరునామా, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు, వారి స్థితిగతులపై సమాచారం సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో నేరాలకు పాల్పడి ప్రస్తుత సత్ప్రవర్తనతో ఉన్న వారి జీవన విధానానికి ఎటువంటి ఆటంకాలు ఉండదన్నారు. నేర ప్రవృత్తికి అలవాటు పడ్డవారిని గుర్తించి వారిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీర్ఘకాలంగా మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారిపై సస్పెక్ట్ షీట్ ఉన్నట్లయితే తొలగిస్తామన్నారు. పదే పదే నేరాలకు, దోపిడీలకు పాల్పడే వారిపై మాత్రం నిరంతర పోలీస్ నిఘా ఉంటుందన్నారు. 2008-2017 మధ్య దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, ఆర్థిక నేరాలు, నకిలీ విత్తనాలు, గుట్కా, మట్కా, భూకబ్జాలు, కిడ్నాప్ వంటి ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడి అరెస్టయిన వారు సుమారు 14,500మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో సుమారు రెండువేల మంది మాత్రమే పదేపదే ప్రాపర్టీ నేరాలు చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో ముందున్న తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరొక బృహత్తర ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, సకల నేరస్థుల సమగ్ర సర్వే ద్వారా పదేపదే దొంగతనాలు, దోపిడీలు చేసే నేరస్థుల నివాస గృహాలకు గూగుల్ మ్యాప్ ద్వారా జియోట్యాగింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రాపర్టీ నేరగాళ్ళు, వారి నివాస ప్రాంతాలను పూర్తిస్థాయి సమాచారం జిల్లాలో సేకరిస్తున్నామన్నారు. టిఎస్‌కాప్ యాప్‌లో ఈ వివరాలన్ని క్రోడీకరిస్తారని, ఈ ప్రక్రియ పూర్తయితే రాష్టవ్య్రాప్తంగా ఎంతమంది నేరస్థులు ఉన్నారో, వారు ఎక్కడెక్కడ ఉంటున్నారో స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. అలాగే గస్తీ సిబ్బంది కూడా తాము గస్తీ నిర్వహిస్తున్న ప్రాంతంలో ఉన్న పాత నేరస్థుల వివరాలు ఫోన్‌లోనే చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. నాయుడుపేట, ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని జహీర్‌పురాతండా, చర్చికాంపౌండ్, రాపర్తినగర్, రమణగుట్ట, ఖానాపురంహవేలిలో సర్వే ప్రక్రియను పోలీస్ కమిషనర్ పరిశీలించారు.

నేరస్థుల్లో మార్పుకోసం సమగ్ర సర్వే
మధిర, జనవరి 18: నేరస్థుల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు సమగ్ర సర్వే చేపట్టినట్లు ఖమ్మం అడిషనల్ డిసిపి సురేష్‌బాబు తెలిపారు. రాష్ట్ర డిసిపి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న నేరస్తుల సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా గురువారం మధిర మండలంలో నిర్వహించిన సర్వేలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నేరస్తులు గతంలో చోరీలకు పాల్పడిన వారు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు. ప్రసుత్తం వారు ఏమి చేస్తున్నారు వంటి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగ దొంగతనాలకు పాల్పడే వారి ప్రస్తుత కదలికలను గమనించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువచ్చి చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నేరస్తులు తమ నేరప్రవృత్తిని మానుకొని తమ కుటుంబాలతో సంతోషంగా గడపాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఆయన వెంట వైరా ఏసిపి ప్రసన్నకుమార్, మధిర సిఐ శ్రీ్ధర్, మధిర టౌన్ అదనపు ఎస్‌ఐ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ రామారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నేరాల నివారణకే ‘సకల’ సర్వే
* సీపీ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం రూరల్, జనవరి 18: ఖమ్మం రూరల్ సర్కిల్ పరిధిలో నేరస్థుల సమగ్ర సర్వే కార్యక్రమాన్ని పోలీసులు గురువారం స్థానిక పెద్దతండా, సత్యనారాయణపురం గ్రామాలలో ప్రారంభించారు. కార్యక్రమాన్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిపి మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని ఖమ్మం, మధిర, వైరా తదితర ప్రధాన కేంద్రాలలో సకల నేరస్తుల సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. గతంలో నేరాలకు పాల్పడిన, శిక్ష అనుభవిస్తున్న, వివిధ రకాల కేసులు నమోదైన వారి వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో పొందుపర్చడంతో పాటు వారి వేలిముద్రలను సేకరిస్తున్నట్టు చెప్పారు. ఒక ప్రదేశంలో ఉండేవారు మరో ప్రదేశానికి వెళ్ళి నేరాలకు పాల్పడుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. భవిష్యత్తులో ఎవరైనా నేరాలకు పాల్పడితే వారి వేలి ముద్రల ఆధారంగా పట్టుకునే అవకాశం ఉంటుందని సిపి వివరించారు. అయితే సర్వే కార్యక్రమం పేరుతో ఎవరినీ వేధింపులకు గురిచేసేదేమీ లేదన్నారు. పాత నేరస్తులు నేర జీవితాలకు స్వస్తిపలికి జన జీవన స్రవంతిలో మెలగాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎసిపి పింగళి నరేష్‌రెడ్డి, సిఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

వైఫై ద్వారా కాంటాలు ఈనామ్‌కు అనుసంధానం
* మార్కెట్‌లో ప్రారంభించిన మార్కెట్ కార్యదర్శి సంతోష్
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 18: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న కమిషన్‌దారుల కాంటాలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా కాంటాల వివరాలు నేరుగా ఈనామ్‌కు వైఫై ద్వారా చేరే విధంగా మార్కెట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించినట్లు మార్కెట్ ప్రధాన కార్యదర్శి ఆర్ సంతోష్ తెలిపారు. గురువారం స్థానిక మార్కెట్‌లోని ఈనామ్ భవనంలో వైఫై టూ ఈనామ్ ఆన్‌లైన్ విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌కు వచ్చే రైతులు దళారులు, కమిషన్‌దారులు, కాంటాల విషయంలో మోసం పోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రైతులు వారి పంటలను కాంటాలు వేసే క్రమంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావటంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా పంటలను కాంట వేసేటప్పుడు కాంట వివరాలు, రైతుపేరు, ఊరు, ధర అన్ని వివరాలు నేరుగా ఈనామ్‌కు చేరుతాయని, దీని వల్ల రైతులు నష్టపోయే అవకాశం లేదన్నారు. మార్కెట్‌లో రైతులను మోసం చేస్తున్న కొంత మంది కమిషన్‌దారులను గుర్తించి వారి లైసెన్స్‌లు రద్దు చేయటం జరిగిందన్నారు. మార్కెట్‌లో అన్ని పనులు ఆన్‌లైన్ ద్వారా జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతులను మోసం చేసే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.