ఖమ్మం

ఇకపై ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 14: జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లను అందించేందుకు విద్యుత్‌శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ వినియోగదారుల అవసరానికి అనుగుణంగా విద్యుత్‌ను వినియోగించుకునేందుకు ఈ మీటర్లను జిల్లాలో కూడా ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వినియోగదారుల అవసరాన్ని బట్టి దరఖాస్తు చేసుకున్న వారికి ఈమీటర్లను అందించనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. విద్యుత్ బిల్లులను ఒక్కసారిగా చెల్లించలేని వారికి ఈ ప్రీపెయిడ్ మీటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ మీటర్లను ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌శాఖ విధించిన నగదును చెల్లించి మీటర్లను రీచార్జ్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. మీటర్ల ధర, రిచార్జ్‌ల ధరలు, కాలపరిమితులపై ఇంకా కసరత్తు పూర్తి కాలేదని త్వరలోనే వాటిని ప్రవేశపెట్టిన తరువాత ప్రీపెయిడ్ మీటర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వినియోగదారులు ఒకేసారి నగదును చెల్లించకుండా వారికి అవసరమైన విద్యుత్ కోసం ఈ ప్రిపెయిడ్ మీటర్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ నూతన మీటర్లు ఇరు జిల్లాల వ్యాప్తంగా ఎన్ని మీటర్లు అవసరమవుతాయన్న దానిపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు బిల్లుల వసూలులో ఇబ్బందులు పడుతున్న అధికారులకు ఈ ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా విద్యుత్‌శాఖకు కూడా బిల్లుల వసూలలో ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మీటర్లు వస్తే వినియోగదారులు అధిక సంఖ్యలో మక్కువ చూపించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
టిఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు
ఖమ్మం(జమ్మిబండ), జనవరి 19: రఘునాధపాలెం మండలం ఈర్లపుడి పంచాయనీ కొర్లబోడు తండాకు చెందిన 55మంది యువకులు శుక్రవారం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ నిర్మాణానికి పటిష్టంగా కృషి చేయాలన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ సంస్కరణలకు ఆకర్షితులై పెద్దఎత్తున యువత టిఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే యువత అభ్యున్నతికి వివిధ సంక్షేమ కార్యక్రమాలు రూపొందించిందన్నారు. వాటిని ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. గుగులోత్ గణేష్, బాలు, లక్‌పత్‌నాయక్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో భూక్యా చిన్నయ్య, వెంగల్, దారావత్ రవి, కృష్ణ, కాళిదాస్, బాణోత్ లాల్‌సింగ్, గుగులోత్ నరేష్, శంకర్, మంగీలాల్, ఉపేందర్, నరేష్, చంద్రశేఖర్, వీరన్న తదితరులు ఉన్నారు.