ఖమ్మం

బచ్చోడుకు బస్సు నడపమన్నాం.. ఏం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జనవరి 19: బచ్చోడుకు బస్సు నడపమన్నాం ఇది మంత్రి మాట అని కూడా మీ దృష్టికి తెచ్చాం చెప్పి 4 నెలలు దాటింది. ఈ చెవిన వింటారు, ఆ చెవిన వదలి వేస్తారు. ఇలాగైతే ఎలా అంటూ ఆర్టీసి అధికారులపై జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక జడ్పీ కార్యాలయంలో చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన స్థారుూ సంఘాల సమావేశాలు నిర్వహించారు. 6స్థారుూ సంఘాల సమావేశాలలో పలు శాఖల అధికారులు సమర్పించిన నివేదికలపై సభ్యులు సమీక్షించారు. ఆర్టీసి ఖమ్మం స్టేషన్ మేనేజర్ తమ నివేదికను వివరిస్తుండగా జడ్పీ చైర్‌పర్సన్ కవిత మాట్లాడుతూ గత నాలుగు నెలల క్రితం జరిగిన స్థారుూ సంఘ సమావేశాలలో తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామానికి ఆర్టీసి బస్ నడపాలన్న విషయాన్ని ఏమి చేశారని ప్రశ్నించారు. ఇంతవరకు ఆ గ్రామానికి బస్ నడపక పోవడంపై తీవ్రంగా ఆగ్రహించారు. గత ఎన్నికల సమయంలో ఆ గ్రామానికి బస్‌ను ఏర్పాటుచేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇచ్చిన హామి కూడా నెరవేర్చలేక పోతే ఎలా అని మండిపడ్డారు. మీ అధికారి ఎందుకు సమావేశాలకు రాలేదని ఆగ్రహించారు. మైనార్టీ సంక్షేమ సంఘం అధికారి బి.వెంకటేశ్వరావు నివేదికలో 50లక్షలతో మైనార్టీలకు శిక్షణాకార్యక్రమాలకు ఏర్పాటుచేశామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తమకెందుకు సమాచారం ఇవ్వడంలేదని ప్రశ్నించగా ఇక నుండి సమాచారం తెలియజేస్తామని సమాధానం చెప్పారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా బయ్యారంలో మంజూరైన రెండు గేదెలు మృతి చెందాయని వాటికి బ్యాంక్ మేనేజర్ ఇన్సూరెన్స్ జమచేయకపోవడంతో లబ్ధిదారులకు ఇన్సూరెన్స్ రాలేదని దీనికి ఎవరు బాధ్యులని సభ్యులు గౌని ఐలయ్య ప్రశ్నించారు. వైకుంఠధామాలకు భూమి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురౌతున్నాయని, ఉపాధిహామి కూలీలకు 12నెలలుగా వేతనాలు రావడంలేదని సభ్యులు చండ్ర అరుణ అన్నారు. జడ్పీ ఉపాధ్యక్షుడు వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు జియావుద్దీన్ మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పట్టించుకోవడంలేదని, మత్స్యశాఖ అధికారులు సభ్యత్వాల విషయంలో చేపలుపట్టి విక్రయించేవారికి ఇవ్వటంలేదని ఈ తప్పిదాన్ని సవరించుకోవాలన్నారు. అనంతరం పలు శాఖల అధికారులు నివేదికలపై సభ్యులు సమీక్షించారు. 7వ స్థారుూ సంఘ సమావేశాన్ని మద్యాహ్నాం 12గంటల సమయంలోజడ్పీ చైర్‌పర్సన్ కవిత ప్రారంభించగా సభ్యులు ఒక్కరే హాజరుకావడం, మిగతా సభ్యుల కోసం దాదాపు 20నిమిషాలు వేచివున్నారు. కోరం పూర్తిస్థారుూలో హాజరైన తర్వాత సమావేశం నిర్వహించుకుందామని ప్రస్తుతానికి దానిని వాయిదావేసి మిగతా సమావేశాలను నిర్వహించారు. సమస్యలు చర్చించాల్సిన ఈ సమావేశంలో నాలుగు జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులైన ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎవ్వరు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. ఈ సమావేశాల్లో జడ్పీ సీఇవో మారుపాక నగేష్, డిప్యూటి సీఇవో శిరీష, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.