ఖమ్మం

పాలేరు రైతులు పండించిన పంటలపై చర్చ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలాయపాలెం, జనవరి 19: ఎన్నో సంవత్సరాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరిందని, రైతులు దృష్టి మళ్ళించి వేసిన పంటలపై ఇతర రాష్ట్రాల ప్రజలు పాలేరు రైతులు పండించిన పంటలపై చర్చ జరగాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం తిరుమలాయపాలెంలో రెండుకోట్లతో నిర్మించనున్న కెజిబివి భవన నిర్మాణానికి, ఆకేరు నదిపై 4.70కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో కళకళలాడాలని, పండ్ల తోటలతో లాభాలు ఆర్జించాలని, సమయాన్ని వృథా చేయవద్దని ఆయన అన్నారు. పంటల గురించి జీవన సరళి గురించి ఇతర ప్రాంతాల ప్రజలు చర్చించుకోవాలని, ఇక్కడ పండిన పంటలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపాలన్నారు. భక్తరామదాసు పథకంతో మెరక భూములకు సాగునీరు అందిస్తామని, అటు తరువాత చెరువులను నింపుతామని, చెరువుల కింద భూములకు సాగునీరు అందిస్తామని, నియోజకవర్గంలో 1.30వేల ఎకరాల భూమిని సాగులోకి తెస్తామన్నారు. తిరుమలాయపాలెం, ఏదుళ్ళచెరువు గ్రామాల్లో ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వలు తవ్వి సాగునీరు అందించాలని ఆ శాఖ ఇఇ, డిఇలు సిబ్బందితో కాల్వ పనులు పూర్తిచేసి చెరువులు నింపాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొక్కిరేణి చెరువును త్వరగా తవ్వి మార్చిలోగా చెరువు నింపాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఏ సమస్యనైనా పరిష్కరించే సత్తా సిఎం కెసిఆర్‌కు ఉందని, ప్రజలు వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలని, జీవన విధానంలో మార్పు రావాలని ఆయన వివరించారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ 60సంవత్సరాల్లో జరగని అభివృద్థి మూడున్నరేళ్ళలో పాలేరు నియోజకవర్గం అభివృద్థి చెందిందన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు లభించడం వారి అదృష్టంగా భావించాలని, మంత్రి తుమ్మల నిత్యం పాలేరు నియోజకవర్గం గురించి ఆలోచిస్తారని, అభివృద్ధి చేయడం తప్ప మరో ఆలోచన చేయడని ఆయన అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో పాలేరు నియోజకవర్గాన్ని మూడున్నరేళ్ళలో అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేశారని, అభివృద్ధికి మారుపేరు తుమ్మల అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తయితే పాలేరులో జరిగిన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తలెత్తుకొని తిరిగే విధంగా అభివృద్థి చేశారని, ఇదంతా సిఎం కెసిఆర్ వల్లే సాధ్యమైందని, అన్ని వర్గాల సంక్షేమం గురించి పాటుపడే వ్యక్తి ఆయన అని వివరించారు. హైకోర్టు లాయర్ బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తాను 22సంవత్సరాల క్రితం 20ఎకరాల్లో మామిడి, సపోట పంట వేశానని, రెండు పంటలపై పదిలక్షల రూపాయల ఆదాయం వస్తుందని, వేసిన పంటలను కాపాడుకోవాలని ఆయన అన్నారు. ముందుగా మంత్రి తుమ్మలకు మోటర్ సైకిల్ ర్యాలీతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఐడిసి చైర్మన్ బుడాన్‌బేగ్, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, కొండబాల వెంకటేశ్వర్లు, ఆర్ నరేష్‌రెడ్డి, ఎం మధు, డిఇ మహేష్, ఎంపిడిఓ వెంకటపతిరాజు, తహశీల్దార్ కృష్ణవేణి, ఎంఇఓ ఇటికాల సత్యనారాయణ, సర్పంచ్ సుజాత, ఎంపిటిసి అనసూయ తదితరులు పాల్గొన్నారు.