ఖమ్మం

వైరాపై కాంగ్రెస్ గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిజర్ల, జనవరి 18: సాధారణ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండగానే నియోజక వర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. వైరా నియోజక వర్గంపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాలతో నూతనంగా వైరా నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడ్డ తరువాత జరిగిన 2009, 2014లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్, సిపిఐ పొత్తులలో భాగంగా సీటును సీపీఐకి కేటాయించారు. దీంతో 2009లో సీపీఐ అభ్యర్థి డాక్టర్ చంద్రావతి విజయం సాధించగా, 2014లో సైతం పొత్తులలో భాగంగా మళ్ళీ సిపిఐకే సీటు కేటాయించటంతో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిపిఐకి ఓట్ల వేయటం ఇష్టంలేని కాంగ్రెస్ కార్యకర్తలు ఒప్పందానికి విరుద్ధంగా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు బదిలీ చేశారు. దీంతో మూడవ స్థానానికి పరిమితం కావాల్సిన వైసిపి అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ అనూహ్యంగా విజయం సాధించారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్‌ను కలిగి ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థి ఓటమి చెందటంతో ఈ సారి టిక్కెట్ కాంగ్రెస్ పార్టీకే వస్తుందన్న నమ్మకంలో నాయకులు, కార్యకర్తలున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఆశావాదులు టిక్కెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన రిటైర్డు ఎస్‌ఐ లావుడ్యా రాములు నాయక్, మాచినేని పేట గ్రామానికి చెందిన మాజీ ఉపాధ్యాయుడు, ప్రస్తుత సర్పంచ్ లకావత్ గిరిబాబు, కొత్తగూడెం పట్టణానికి చెందిన మాళోతు రాందాస్ నాయక్, మహబూబబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ ధరావత్ అంకిత, కొణిజర్ల మండలం ఉప్పల చెలక గ్రామానికి చెందిన ప్రస్తుత సర్పంచ్ బాదావత్ సైదులు నాయక్ టిక్కెట్ కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఎవ్వరికి వారే తమతమ స్థారుూలో తీవ్రంగా ప్రయత్నిస్తూనే గ్రామాలలో విస్త్రృతంగా పర్యటిస్తూ ద్వితియ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటూ టిక్కెట్ తనకే వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. రాములు నాయక్ మధిర శాసన సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క ద్వారా, గిరిబాబు, సైదులు కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి ద్వారా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి అనుచరుడు రాందాస్ నాయక్ రేవంత్ రెడ్డి ద్వారా టిక్కెట్ దక్కించుకోవటం కోసం ప్రయత్నిస్తున్నాట్లు తెలిసింది. రాములు నాయక్ 2014 ఎన్నికలోనే టిక్కెట్ ఆశించినప్పటికీ పొత్తులలో సిపిఐకి కేటాయించటంతో ఈసారి ఐన టిక్కెట్ తెచ్చుకోవాలన్నా పట్టుదతో ఉన్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ నుంచి రాందస్ నాయక్ టిక్కెట్ ఆశించినప్పటికీ పార్టీ అధిస్థానం బాలాజీకి కేటాయించింది. ఏఏ పార్టీల మధ్య పొత్తు ఉంటుందో ఏ పార్టీకి సీటు కెటాయిస్తారో, టిక్కెట్ ఎవ్వరికి వస్తుందో తెలియాలంటే చివర వరకు వేచి చూడాల్సిందే.