ఖమ్మం

రామయ్యకు బంగారు తులసి పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జనవరి 20: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం వైభవంగా బంగారు తులసి పూజ నిర్వహించారు. స్వామిని ఆరాధించి నామార్చనలు చేశారు. వేద పండితులు క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేయడంతో భక్తులు మంత్రుముగ్ధులయ్యారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి నిత్య కల్యాణ మహోత్సవాన్ని ఆరంభించారు. తొలుత ఉదయం ఆలయ తలుపులు తీశాక సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం తదితర పూజలు నిర్వహించారు. నిత్యకల్యాణ మహోత్సవం సందర్భంగా గోదావరి పుణ్యజలాలతో స్వామివారి పాదుకలకు అభిషేకం జరిపారు. వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనపూజ, పుణ్యహావచనం జరిపి వధూవరుల గోత్రనామాలను చదివి ప్రవర పఠించారు. ఎంతో పవిత్రమైన యోక్త్ధ్రారణ, కంకణధారణను కడు రమణీయంగా జరిపించి యజ్ఞోపవీతధారణను కనువ పండువగా నిర్వహించారు. మాంగల్యధారణ చేసి తలంబ్రాల వేడుకను నిర్వహించిన అనంతరం దర్బార్‌సేవ జరిపారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామికి విన్నవించారు. భక్తులకు శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.