ఖమ్మం

భక్తునికి, భగవంతునికి వారధిగా నిలిచిన రామదాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జనవరి 20: భగవంతుని చేరడానికి సులభమైన మార్గం భక్తి అని భక్తునికి, భగవంతునికి వారధిగా నిలిచారు భక్త రామదాసు. 17వ శతాబ్దానికి చెందిన ఈయన భద్రగిరిపై వెలసిన శ్రీరామచంద్రమూర్తికి గుడి, గోపురాలు కట్టించి, దాశరథీ శతకం రచించి తన జీవిత ఆద్యంతం శ్రీరామచంద్రుని సేవలో గడిపి, నూటికి పైచిలుకు కీర్తనలు భజన సంప్రదాయంలో పాడి, తను తరించి, తరతరాలను తరింప చేస్తున్నారు. సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి తన ప్రహ్లాద భక్తి విజయం అనే గేయ నాటకంలో రామదాసుని, ప్రహ్లాద, నారద, పరాశర తదితర భక్తులలో చేర్చి కీర్తించడమే కాకుండా తనకు ఆదర్శమని తన కృతులలో కొనియాడారు. భజన సంప్రదాయ పద్ధతిలో మనకు ఈనాటికి లభించిన రామదాసు కీర్తనలను ఎందరో విద్వాంసులు అఖండ గానంతో రామదాసు జయంతిని వాగ్గేయకారోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. ఏటా మాఘ మాసంలో రామదాసు జన్మ నక్షత్రం పూర్వాభద్ర రోజున శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వాగ్గేయకారోత్సవాలను నిర్వహిస్తోంది. రామదాసు కీర్తనలు భారతీయులకు వారసత్వంగా లభించిన అత్యంత విలువైన సంపద. వీటిని పరిరక్షించేందుకు, శాస్ర్తియ సంగీతాన్ని వృద్ధి చేసేందుకు వాగ్గేయకారోత్సవాలు వేదికగా నిలుస్తున్నాయి. సుమారు 400 మంది కళాకారులు ఐదు రోజుల పాటు వాగ్గేయకారోత్సవాల్లో రామదాసు కీర్తనలతో అఖండ బృందగానం చేయనున్నారు. భద్రగిరి సంగీతఝరులతో పులకించనుంది.

నగర సంకీర్తనతో మొదలు...

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ భక్తరామదాసు 385వ జయంతి ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. చిత్రకూట మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. నేడు భక్త రామదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటంతో కళాకారులంతా నగర సంకీర్తన, రామదాసు విగ్రహానికి అభిషేకం చేయనున్నారు. చెన్నైకు చెందిన మాంబలం సిస్టర్స్, కుమారి శ్రీవిద్య, చెందిన ఆర్.గణేష్ నామ సంకీర్తన బృందం, లక్ష్మీప్రియ, వైజాగ్‌కు చెందిన చైతన్య బ్రదర్స్, చెన్నైకు చెందిన సుజన (వీణ), హైదరాబాద్‌కు చెందిన లహరి, బెంగుళూరుకు చెందిన ధూళిపాళ వాసవతి, చెన్నైకు చెందిన వసుధ రవి, తిరుపతికి చెందిన డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్ర్తీ తొలిరోజు సంగీత కచేరీలు చేస్తారు.

నీలంరాజు వెంకట శేషయ్య చొరవతో...
భక్త రామదాసును స్మరించుకుంటూ ఆయన ప్రవేశపెట్టిన భజన సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అలనాటి పత్రికా ఎడిటర్ నీలంరాజు వెంకట శేషయ్య ఆధ్వర్యంలోని రామాలయం ఉద్ధరణ కమిటీ చొరవ చూపింది. 1962లో విరాళాలు సేకరించి భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని రంగనాయకుల గుట్టపై నిర్మించారు. అప్పటి భారతదేశ ఉప రాష్టప్రతి రాధాకృష్ణన్ శంకుస్థాపన చేశారు. 1989 వరకు ఈ ధ్యానమందిరంలోనే నిర్వహించినా శాస్ర్తియ సంగీతంపై సినిమా సంగీతం ప్రభావం చూపడంతో వాగ్గేయకారోత్సవాలు వెలవెలబోయాయి. చివరకు ఉత్సవాలకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో గుట్ట నుంచి కిందకు దించి చిత్రకూట మండపంలో ఏటా నిర్వహిస్తున్నారు.