ఖమ్మం

ఆర్టీసీ సంక్రాతి ఆదాయం రూ. 37,33,527

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురంహవేలి, జనవరి 20: సంక్రాతి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు హైద్రరాబాద్‌కు నడపటం ద్వారా 37 లక్షల 33 వేల 527 రూపాయల ఆదాయం లభించినట్లు ఆర్‌టిసి డివిజనల్ మేనేజర్ జి జగన్ వెల్లడించారు. శనివారం తన ఛాంబర్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 9 నుంచి 18 వరకు ఖమ్మం రీజియన్ నుండి హైద్రబాద్‌కు 767 ప్రత్యేక బస్సులు నడపటం ద్వారా ఈ ఆదాయం లభించిందన్నారు. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుండి ఈ సంవత్సరం 767 బస్సులు 1377 ట్రిప్పులు 4 లక్షల 24 వేల 59 కిలోమీటర్ల నడపగా 1 కోటి 43 లక్షల 57 వేల 458 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. గత సంవత్సరం 619 బస్సులు 1158 ట్రిప్పులు 3 లక్షల 40 వేల 897 కిలోమీటర్లు నడపటం ద్వారా 1 కోటి 6 లక్షల 23 వేల 931 ఆదాయం లభించిందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆదనంగా 148 బస్సులు 219 ట్రిప్పులు 83 వేల 162 కిలోమీటర్లు నడపటం ద్వారా 37 లక్షల 33 వేల 527 రూపాయల అదనపు ఆదాయం లభించిందన్నారు. హైద్రబాద్‌లోని ఎల్‌బి నగర్ పాయింట్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థం షామియానా, మంచినీరు, కుర్చీలు, లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజు అడ్వాన్స్ రిజర్వేషన్ ద్వారా బస్సు సర్వీసులు నడిపినట్లు తెలిపారు. టిఎస్‌అర్‌టిసిని అదరించిన ప్రయాణీకులతో పాటు సంస్థ మనుగడకు బస్సు సర్వీసులను విజయవంతంగా నడిపిన తమ సిబ్బందికి డివిఎం జగన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం రీజయన్ పరిధిలోని 6 డిపోల మేనేజర్లు, సిఐలు పాల్గొన్నారు.

సీఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
చింతకాని, జనవరి 20: సర్వశిక్షా అభియాన్‌లో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సిఆర్‌పి)కు ఉద్యోగ భద్రత కల్పించాలని చింతకాని సీఆర్పీ అసోసిఏషన్ నాయకుడు కృష్ణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 21న వరంగల్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఆర్పీల మహా సదస్సు పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్పీలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలైన హరితహారం, సమగ్ర కుటుంబ సర్వే, వేసవి బడుల నిర్వహణ, వేసవిలో మధ్యాహ్న భోజన పరిశీలన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎన్నో సమస్యలకు గురవుతున్నామన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నవాబ్‌పాషా, ఎంఈఒ ఆబ్రహం, సిఆర్‌పిలు డి తిరుపతిరావు, ఎన్ గురవమ్మ, ఎన్ నిర్మల, పద్మజ పాల్గొన్నారు.