ఖమ్మం

క్రీడలతో మానసిక ఉల్లాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (స్పోర్ట్స్), జనవరి 20: క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి హేమలత అన్నారు. శనివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి ఉద్యోగులు క్రీడలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు పని ఒత్తిడిలో ఉంటారన్నారు. ప్రజాసేవలో భాగంగా ఉద్యోగులు పని ఒత్తిడితో పాటు నిరంతరం అలసిపోతుంటారన్నారు. ఉద్యోగుల శారీరక, మానసికోల్లాసానికి క్రీడలు అవసరమన్నారు. క్రీడల వల్ల ఉద్యోగుల్లో సమైక్యతా భావం, సోదర భావం పెంపొందుతాయని తెలిపారు. తొలుత జరిగిన కార్యక్రమంలో ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో ఉన్న 72 శాఖలకు చెందిన ఉద్యోగులు మార్చ్‌పాస్ట్ చేసి, వందనం సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రీడా నిర్వాహకులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల క్రీడలు నిర్వహించడం తెలంగాణ జిల్లాల్లో ఇదే మొదటిసారన్నారు. ఖమ్మంలోని ఉద్యోగులు ఈ క్రీడలను జయప్రదం చేయాలన్నారు. నిర్వాహకులు పురుషుల విభాగంలో కబడ్డి, చదరంగం, క్యారమ్స్, షటిల్, ఖోఖో, క్రెకెట్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, మహిళల విభాగంలో టగ్ ఆఫ్ వార్, టెన్నికాయిట్, క్యారమ్స్, చేస్, లెమన్ స్పూన్, ఖోఖో, త్రో బాల్, స్టార్ మహిళ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉధ్యోగుల పిల్లలకు, రిటైర్డ్ ఉద్యోగులకు సైతం క్రీడలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖాధికారి శంకర్‌నాయక్, జిల్లా క్రీడా శాఖాధికారి పరంధామరెడ్డి, ఆర్డీఓ పూర్ణచంద్రరావు, డిసిఓ జుమ్‌కిలాల్, ఎడి ఫిషరీస్ హనమంతరావు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటపతిరాజు, మల్లెల రవీద్రప్రసాద్, పట్టణ నాయకులు వల్లోజు శ్రీనివాసరావు, కోడి లింగయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

కొత్త పంచాయతీ గ్రామాల హద్దుల పరిశీలన
చింతకాని, జనవరి 20: మండలంలో కొత్తగా మరో ఆరు నూతన గ్రామ పంచాయయితీలు ఆవిర్భవించనున్నాయి. ప్రభుత్వం 500 ఓటర్లు ఉన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయనుండడంతో గ్రామాల హద్దులు, సర్వే నంబర్లు వంటి వివరాలను పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు సిద్ధం చేస్తున్నారు. మండలంలో గాంధీనగర్ కాలనీ, రెపల్లెవాడ, నాగులవంచ రైల్వే కాలనీ, రాఘవాపురం, నర్సింహాపురం, తిరుమలాపురం గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఆవిర్భవించనున్నాయి. దీంతో పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు నూతన పంచాయతీలుగా ఏర్పాటు కానున్న గ్రామాల వివరాలు సేకరిస్తున్నారు. జనాభా, హద్దులు, ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. మండలంలో ఉన్న 20 గ్రామ పంచాయతీలకు గాను మరో 6 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానుండడంతో మొత్తం 26 గ్రామ పంచాయతీలు కానున్నాయి. మండలంలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నిక విధానాలు ఎలా ఉన్నా బరిలో దిగేందుకు నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతమున్న 26 గ్రామాలకు గాను 20 గ్రామ పంచాయతీలున్నాయి. మండల జనాభా 48,909 కాగా 24,180 మంది పురుషులు, 24,729 మంది స్ర్తిలు ఉన్నారు. కొత్తగా ఏర్పడనున్న గాంధీ నగర్ కాలనీ (1100), రేపల్లెవాడ (662), రాఘవాపురం (627), తిరుమలాపురం (696), నర్సింహపురం (948), నాగులవంచ రేల్వే కాలనీ (660) ఓటర్లు ఉండడంతో కొత్త పంచాయతీలు ఏర్పాటు కావడం ఖాయమంటున్నారు అధికారులు.