ఖమ్మం

రూ 290 కోట్లతో 86 గ్రామాల్లో అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 20: మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం స్థానిక సింగరేణి అతిథి గృహంలో జిల్లా మినరల్ ఫౌండేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోని 86 గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు రూ 290 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల గ్రామాల జాబితాను సింగరేణి అధికారులకు అందజేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు ఎటువంటి జాప్యం చేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వాతావరణ పరిస్థితుల ప్రభావం తగ్గించటం కోసం వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మైనింగ్ నిధులను ఆరోగ్య పరిరక్షణ, విద్యాభివృద్ధి, స్ర్తి, శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, వృత్తి నైపుణ్యాభివృద్ధి, పరిసరాల పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామ సభల తీర్మానం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ప్రతి ఏడాది ఐదు శాతం నిధులను భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకుల్లో జమ చేయటంతోపాటు, నిధుల వినియోగంపై పర్యవేక్షణ చేయాలని కోరారు. మినరల్ ఫౌండేషన్‌కు సంబంధిత సంస్థల ఉత్పత్తి ఆధారంగా ఏటా నిధులు చెల్లించాల్సి ఉంటుందని, ఆ నిధులతో గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామాని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాందీ హనుమంతు మినరల్ ఫౌండేషన్ నియమ, నిబంధనలను ప్రజా ప్రతినిధులకు వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను కేటాయించన్నుట్లు తెలిపారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల విస్తీర్ణాన్ని ఐదు కిలోమీటర్ల లోపునకు పెంచాలని పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గడిపెల్లి కవిత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటరావు, పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డిఆర్‌డివో పిడి జగత్ కుమార్‌రెడ్డి, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్‌పర్సన్‌లు పులి గీత, మడత రమ, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన జడ్పీటిసి, ఎంపిపిలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

నేటి నుండి భక్తరామదాసు జయంతి ఉత్సవాలు
* ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు * మందిర అభివృద్ధి పనులకు తుమ్మల శంకుస్థాపన
నేలకొండపల్లి, జనవరి 20: పరమ భక్తాగ్రేసరుడు, భద్రాచలం ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు శ్రీ భక్తరామదాసు(కంచర్ల గోపన్న) జయంతి ఉత్సవాలు నేటి నుండి జన్మస్థలమైన నేలకొండపల్లిలో ప్రారంభంకానున్నాయి. ఈ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతికశాఖ, భద్రాచలం దేవాలయం, శ్రీ భక్తరామదాసు విద్వత్ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా 21వ తేదిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. అనంతరం భజన కార్యక్రమం, రామదాసు కీర్తనలు ఆలాపన, సంగీత కార్యక్రమం, భక్తరామదాసు నవరత్న కీర్తనలు, కూచిపూడి నృత్యం, పేరిణి నాట్యం, కధక్ నృత్యం నిర్వహించనున్నారు. 22న సంగీత కార్యక్రమం, భజన కార్యక్రమం, శ్రీరామ నీ నామమెంత రుచిరా, నృత్యం కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే 23న సంగీత కార్యక్రమంతో పాటు కర్నాటక గాత్ర కచేరి, విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణము, వీణా కచ్చేరి, దాశరధి శతకం, రామదాసు కీర్తనమృతం, పేరరిణి నాట్యం, మృదంగ విన్యాసం తో పాటు ముగింపు సభ నిర్వహించనున్నారు.

రామదాసునికి పట్టువస్త్రాలను సమర్పించిన కంచర్ల శ్రీనివాసరావు
నేలకొండపల్లి, జనవరి 20: శ్రీ భక్తరామదాసు జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ భక్తరామదాసునికి పట్టువస్త్రాలను అందించారు. నేలకొండపల్లిలోని శ్రీ భక్తరామదాసు ధ్యాన మందిరంలో జరిగే జయంతి ఉత్సవాలకు కావలసిన పట్టువస్త్రాలను భక్తరామదాసుని 10వ వారసుడు కంచర్ల శ్రీనివాసరావు పట్టువస్త్రాలు శనివారం సమర్పించారు. ప్రతి సంవత్సరం స్వామి వారికి పట్టువస్త్రాలు అందిస్తున్నట్లు అలాగే ఈ సంవత్సరం కూడా పట్టువస్త్రాలతో పాటు పూల దండలు పూజారి రమేష్‌కు అందించినట్లు తెలిపారు. శ్రీ భక్తరామదాసు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, విద్వత్ కళాపీఠం అధ్యక్షుడు సాధు రాధాకృష్ణమూర్తి, ఉస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల పంట బయట.. వ్యాపారుల వాహనాలు లోపల
* పట్టించుకోని అధికారులు
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 20: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు వారి పంటలను పెట్టుకునేందుకు ఏర్పాటు చేసిన షెడ్‌లలో వ్యాపారుల వాహనాలను పెట్టుకునేందుకు షెడ్‌లను ఏర్పాటు చేసినట్లుగా మార్కెట్‌లో పరిస్థితి నెలకొంది. ఆరుగాలం పండించిన పంటలను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చిన రైతుల పంటలకు కనీసం నిలువెత్తు నీడకూడా లేకుండా వ్యాపారులు షెడ్‌లను ఆక్రమిస్తున్నారు. మార్కెట్‌శాఖ ఆధ్వర్యంలో లక్షల రూపాయలు వెచ్చించి రైతుల పంటలను ఏర్పాటు చేసుకునేందుకు నిర్మించిన షెడ్‌లను కొందరూ వ్యాపారులు వారి వాహనాలను ఏర్పాటు చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన రైతులు వారి పంటలను పెట్టుకునేందుకు షెడ్‌లు ఖాళీ లేకపోవటంతో చేసేదేమిలేక, అధికారులు ప్రశ్నించలేక ఆరుబయటనే వారి పంటలను పెట్టుకుంటున్నారు. మార్కెట్‌లో వ్యాపారుల అగడాలకు అడ్డు అధుపులేదనటానికి ఇది ఒక నిదర్శనమని కొందరూ ఆరోపిస్తున్నారు. మార్కెట్‌శాఖ ఆధ్వర్యంలో మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క అవసరాలు వ్యాపారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటున్నాయన్న విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. రైతులను అన్ని విధాలుగా మోసం చేయటమే కాకుండా వారి కోసం ఏర్పాటు చేసిన వాటిని సైతం వ్యాపారులే వినియోగించుకోవటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు రైతుల కోసం ఏర్పాటు చేసిన అవసరాలను వారికే ఉపయోగపడేలా చర్యలు చేపట్టిల్సిన అవసరం ఉంది.

గోపన్న ప్రాశస్త్యానికి తుమ్మల ప్రాధాన్యం
* వాడవాడలా భక్తరామదాసు కీర్తిని చాటేందుకు ఏర్పాట్లు * నేడు స్వయంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నేలకొండపల్లి, జనవరి 20: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మదిలో కంచర్ల గోపన్నకు స్థానం దక్కింది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వాగ్గేయకారుడు, భద్రాచలం దేవాలయం నిర్మాత, పరమ భక్తగ్రేసరుడు శ్రీ భక్తరామదాసు (కంచర్ల గోపన్న) జన్మస్థలం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా భక్తరామదాసుపై శ్రద్ధచూపలేదు. ఎన్నో సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోక, దీప ధూప నైవేద్యంకు సైతం నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంది. 2000 సంవత్సరంలో భద్రాచలం దేవాలయానికి ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్భా ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా గెలవటం అనంతరం మూడు వందల కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్‌కు శ్రీ భక్తరామదాసుని నామకరణం చేయటంతో భక్తరామదాసు పేరు వెలుగులోకి వచ్చింది. అనంతరం విద్య సంవత్సరంలో 6వ తరగతిలో తెలుగు వాచకం, ఉప వాచకంలో శ్రీ భక్తరామదాసు చరిత్రను చేర్చి విద్యార్థి దశ నుండి శ్రీ భక్తరామదాసుని చరిత్రను తెలుసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. అనంతరం భక్తరామదాసు జన్మస్థలం అభివృద్ధికి నిధులను కేటాయించటంతో పాటు మందిరం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా ఆడిటోరియం, ప్రహరీలతో పాటు పలు కార్యక్రమాలకు భారీగా నిధులను మంజూరు చేశారు.