ఖమ్మం

రానున్న మూడేళ్ళలో వైరాకు గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిజర్ల, జనవరి 21: రానున్న మూడెళ్ళలో వైరాకు గోదావరి జలాలను తీసుకొస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నియోజక వర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక శాసన సభ్యులు బాణోత్ మదన్‌లాల్ అధ్యక్షతన ఆదివారం కొణిజర్ల సమీపంలోని ఒక ప్రవేటు ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనం ఎన్ని పనులు చేసిన మన ప్రవర్తన, నవడిక, ఆలోచన విధానాన్ని ప్రజలు, కార్యకర్తలు గమనిస్తుంటారని మంచి ప్రవర్తన కలిగిన, చిత్తశుద్ధి కలిగిన నాయకులే సుదీర్ఘ కాలం రాజకీయాలలో రాణించగలరని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ళు ఇవ్వాలంటే ముందు ఆంధ్రకు ఇవ్వాలని నేనే చెప్పావాడిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో మన నీళ్ళను మనమే వాడుకొనే అవకాశం లభించిందన్నారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి పరిపాలన దక్షుడు కావటంతో భక్త రామదాసు నుంచి మోటార్ల ద్వారా ఎత్తిపోతల ఎత్తిపోస్తే లక్ష ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పటంతో ఆదేశాలిచ్చిన ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు. ఎండకాలంలో వరి నాట్లు వేసుకుంటారని తను ఊహించలేదని, భక్తరామదాసుతో కరవు మండలాలలో వరినాట్లు వేసుకుంటారని తాను ఊహించలేదన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏఒక్క హామీని విస్మరించేది లేదని స్పష్టం చేశారు. 48 వేల కోట్లు మంచినీళ్ళుకు, విద్యుత్ కోసం లక్షకోట్లు, 45 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మరో ఐదారు నెలలో ప్రతి ఇంటికి మంచినీరు అందచేస్తామని వెల్లడించారు. రెండేళ్ళలో సాగునీటి కష్టాలు తీరబోతున్నాయని, ఆత్మహత్యలు లేని తెలంగాణ సృష్టిస్తామని చెప్పాం, మరో ఐదేళ్ళలో ఆత్మహత్యలు లేని తెలంగాణను సాధిస్తామని హామీ ఇచ్చారు. రానున్న పంచాయితీ, కోఆఫరేటివ్, అసెంబ్లీ ఏ ఎన్నికలోచ్చిన టిఆర్‌ఎస్ విజయం సాధించాలని అవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వెలసి ఐక్యంగా పని చేయాలని కోరారు. పార్టీ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంతటి వారిపైనేన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌ఫర్సన్ గడిపల్లి కవిత, పార్టీ జిల్లా ఇంచార్జీ తక్కెళ్ళపల్లి రవీందర్, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా నాయకులు గుత్తా వెంకటేశ్వరావు, మచ్చా బుజ్జి, మండల పార్టీ అధ్యక్షుడు వై చిరంజీవి, ఏఎంసి చైర్మన్ బాణోత్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
భక్తరామదాసు సైకత శిల్పం
* శిల్పిని సత్కరించిన మంత్రి తుమ్మల
నేలకొండపల్లి, జనవరి 21: పరమభక్తాగ్రేసరుడు, భద్రాచల ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు శ్రీ్భక్తరామదాసు(కంచర్లగొపన్న) సైకత శిల్పాన్ని తయారు చేశారు. ఆదివారం నేలకొండపల్లిలోని శ్రీ భక్తరామదాసు ధ్యాన మందిరం నందు జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడెం గ్రామంకు చెందిన రావెల్లి శంకర్ అనే శిల్పి భక్తరామదాసుని చిత్రంను సైకత(ఇసుక)తో నిర్మించారు. దీనికి గాను ఇసుక, గ్లాసు, సిమెంట్, కలప తదితర 13 రకాల వస్తువులతో ఈ బొమ్మను చేశారు. దీనిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిలకించి ముగ్ధులై శిల్పి శంకర్‌ను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.