ఖమ్మం

రామదాసు కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, జనవరి 21 : భక్తరామదాసు కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోతామని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం నేలకొండపల్లిలోని శ్రీ భక్తరామదాసు ధ్యాన మందిరం నందు భక్తరామదాసు జయంతి ఉత్సవాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ శ్రీ భక్తరామదాసు ప్రాజెక్ట్ ప్రారంభంలో ఇక్కడి ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చారని, దానికి ఆయన కట్టుబడి ఉన్నారని, అందుకై భక్తరామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాగేయకారులైన పోతన, భక్తరామదాసులను ప్రత్యేక గౌరవంతో వెలుగులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. భక్తరామదాసు మందిరంలో సకల సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మందిరం సమీపంలో ఆడిటోరియంను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తరామదాసు ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసినట్లుగానే భక్తరామదాసు స్మృతి భవనం కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు. ప్రజలు సందర్శంచే ప్రాంతంగా దీనిని అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా బౌద్ధక్షేత్రంతో పాటు బాల సముద్రం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎం పీఆర్‌ఓ వనం జ్వాలా నరిసింహరావు, భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, జెడ్పి చైర్మన్ గడిపల్లి కవిత, టూరిజం జిల్లా అధికారి సుమన్ చక్రవర్తి, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శాఖామూరి రమేష్, కళాపీఠం అధ్యక్షుడు సాధు రాధాకృష్ణమూర్తి, ఎంపిపి నందిగామ కవితరాణి, ఎంటిసిలు చిలకల సీతారావమ్మ, టిఆర్‌ఎస్ నాయకులు ఉన్న బ్రహ్మయ్య, నాగుబండి సత్యనారాయణ, వెన్నపూసల సీతారాములు, కొటి సైదారెడ్డి, మైసా శంకర్, నెల్లూరి భద్రయ్య, కాసాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.