ఖమ్మం

ఐక్యత తెచ్చిన ‘ఆట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(స్పోర్ట్స్), జనవరి 21: నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఉల్లాసంగా గడిపారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆటలాడుతూ తమ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న 73సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యూనిఫామ్ ఉద్యోగులు కూడా ఈ సంఘంలో ఉండటం విశేషం. అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులతో కూడిన ఈ సంఘం ఆధ్వర్యంలో సర్థార్ వల్లభాయి పటేల్ స్టేడియంలో జరుగుతున్న ఆటలపోటీలు ఆదివారం ఉత్సాహంగా, కోలాహలంగా జరిగాయి. ఆయా శాఖల ఉద్యోగులు, అధికారులు కలిసి ఆటలాడుతూ తమ మధ్య ఐక్యతను చాటారు.
దీనికి తోడు రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఈ ఆటల్లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. మహిళల మ్యూజికల్ చైర్ ఆటను ప్రారంభించిన అనంతరం కొద్దిసేపు ఉద్యోగులతో క్రికెట్‌ను ఆడారు. రెండురోజులుగా సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల క్రీడల్లో ఆదివారం పాల్గొన్న మంత్రి వారితో ఆటలాడి ఉల్లాసంగా గడిపారు. తొలుత సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, రామయ్య, నాయకులు వెంకటపతిరాజు, రవీంద్రప్రసాద్, లింగయ్య, వెంకన్న, వల్లోజి శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్థి అధికారులపై ఆధారపడే నడుస్తున్నదన్నారు. రాష్ట్రం దేశంలోనే గర్వించదగిన స్థాయిలో నిలబడిందంటే దానికి కారణం ఉద్యోగులేనని స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం కూడా ఉద్యోగులకు అండగా ఉంటున్నదని వెల్లడించారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నదన్నారు. ఉద్యోగులు ప్రజల సమస్యలు లేకుండా సుఖంగా ఉన్నామనే వరకు విశ్రమించవద్దని పేర్కొన్నారు. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉల్లాసంగా గడపాలని ఆకాంక్షించారు. అదే ఉత్సాహంగా విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. సుమారు 76సంఘాలు, 53శాఖలకు చెందిన 16వేల మంది పోటీలకు విచ్చేయడం హర్షణీయమన్నారు. జిల్లా, రాష్ట్రంలోని అన్ని పథకాల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిందని, అదే క్రమంలో వారికి ప్రభుత్వం అండగా ఉన్నదని గుర్తుచేశారు. ఆటలతో ఉల్లాసంగా గడిపిన ఉద్యోగులు తిరిగి ఉత్సాహంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆటలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసున్న పాలకులు
* పలు గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన
బోనకల్, జనవరి 21: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపాధిహమీ ద్వారా గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను పక్కదోవ పట్టిస్తూ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షులు చింతలచెర్వు కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు గత 2సంవత్సరాల నుండి జరిగే ఉపాధిహమీ పనుల నుండి మెటీరియల్ గ్రాంట్ కింద పంచాయతీలకు రావాల్సిన నిధులు 22పంచాయతీలకు గాను 79.39లక్షలు కాగా వచ్చిన నిధులను దామాషా ప్రకారం కేటాయించాల్సి ఉందన్నారు. కాని నిధులను రాష్ట్ర ప్రభుత్వం రూ 31.81లక్షలు తగ్గించి అట్టి నిధులను దారి మళ్లించిందన్నారు. ఈ దారి మళ్ళించిన నిధులను టిఆర్‌ఎస్ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోగా ఉపాధి హమీ ద్వారా వచ్చిన నిధులను కూడా దారి మళ్లించడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ పద్దతి మార్చుకొవాలని సర్పంచ్‌లు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు చండ్ర సరిత, ఎం వాణి, భూలక్ష్మి, షేక్ షిలార్‌బి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.