ఖమ్మం

గ్రీవెన్స్‌లో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 22: ప్రజల నుంచి గ్రీవెన్స్‌కు వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ఆయన మాట్లాడుతూ గతంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూముల పరిష్కారం కోసం సమగ్ర పరిశీలన చేసిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. టేకులపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గత ప్రభుత్వం రైతులకు అటవీహక్కుల యాజమాన్య చట్టం ప్రకారం ఇచ్చిన భూముల్లో ఫారెస్టు అధికారులు ట్రెంచ్ కటింగ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని టేకులపల్లి జడ్పీటీసీ లక్కినేని సురేందర్ కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ కోరారు. సమాజ సేవ చేస్తున్న ప్రతినిధులకు ప్రభుత్వం గుర్తింపును ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని గాంధీపథం నాయకులు చింతలచెర్వు గెర్షోం కోరారు. ములకలపల్లి మండలం పూసుగూడెం పంచాయతీలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇప్పించాలని కోరారు. చుంచుపల్లి మండలం సర్వారానికి చెందిన రాంబాబు ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చిట్టి రామవరానికి చెందిన గుగులోతు వినోద్ కుమార్ వినతిపత్రం అందజేశారు. ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ మృతి చెందిన తండ్రి ఉద్యోగం తల్లికి ఇప్పించాలని గుమ్మడి స్వాతి అనే యువతి కోరారు. అశ్వారావుపేట మండల వెంకమ్మ చెరువు వరద కాలువ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు. టేకులపల్లి మండలం తడికలపూడి గ్రామ పంచాయతీ నుంచి లక్ష్మీపురం వరకు రేషన్‌షాపు ద్వారా సరుకులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా స్థానికంగా రేషన్‌షాపును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కిరణ్‌కుమార్, ఆర్డీవో రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.