ఖమ్మం

సుజాతనగర్ పంచాయతీ ఏకగ్రీవానికి టీఆర్‌ఎస్ సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 22: సుజాతనగర్ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ అభ్యర్థి ఎన్నికకు టిఆర్‌ఎస్ పార్టీ సహకరించాలని ప్రతిపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. లేదంటే ఉమ్మడి అభ్యర్థిగా కాసాని పావనిని ఎన్నికల బరిలో నిలిపి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, కాసాని అయిలయ్య మాట్లాడారు. సుజాతనగర్ సర్పంచ్‌గా ఎన్నికైన కాసాని లక్ష్మి ఆకస్మికంగా మృతి చెందటంతో జరుగుతున్న ఎన్నికల్లో కాసాని కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల పరిష్కారం, పేద ప్రజల హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు సాగించిన కాసాని లక్ష్మి మృతితో ఏర్పడిన సర్పంచ్ పదవికి కోడలు కాసాని పావనికి మిత్రపక్షాల సంపూర్ణ మద్దతు ఇస్తాయని అన్నారు. పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించే సంప్రదాయానికి టిఆర్‌ఎస్ కట్టుబడి ఉండాలని, లేనిపక్షంలో ప్రతిపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దింపుతామని స్పష్టం చేశారు. గత 25 ఏళ్లుగా సుజాతనగర్ పంచాయతీ అభ్యర్థిలో కాసాని కుటుంబం కీలకపాత్ర పోషించిందని తెలిపారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉపఎన్నికల్లో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అభ్యర్థిని ఎంపిక చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు వనమా రాఘవేంద్రరావు, ఎస్‌కె సాబీర్‌పాషా, రావి రాంబాబు, అన్నవరపు సత్యనారాయణ, కాసుల వెంకట్, బత్తుల వీరయ్య, కరాటే రామస్వామి తదితరులు పాల్గొన్నారు.