ఖమ్మం

కొనసాగుతున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 22: విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న సమ్మె సోమవారంకు ఆరవ రోజుకు చేరింది. సమాన పనిని సమాన వేతనం ఇవ్వటంతోపాటు కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఐఎన్‌టియుసీ అనుబంధ 327 యూనియన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అన్‌మాన్డ్ కార్మికులకు స్కిల్ వేతనాలు చెల్లించాలని, విధి నిర్వహణలో మరణించిన శాశ్వత అంగవైకల్యానికి గురైన కార్మికులకు రూ 10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. జెఎల్‌ఎం రిక్రూట్‌మెంట్‌లో కాంట్రాక్టు కార్మికులకు వెయిటేజీ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని విద్యుత్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాలరావు, రామకృష్ణ, రాజేష్, నర్శింహారావు, రాజశేఖర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.