ఖమ్మం

కలిసి పనిచేస్తే గెలుపుఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జనవరి 22: వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా నేతలంతా కలిసి పనిచేస్తేనే గెలుపు సులభమవుతుందని, విబేధాలు వీడి ఐక్యంగా పనిచేయాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరైనా ఆశపడవచ్చని, అందులో కొత్తవారు కూడా ఉండవచ్చని, అయితే పార్టీ ఎవరికి ఇచ్చినా వారికి మద్దతుగా మిగిలిన వారంతా పనిచేయాలన్నారు. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎవరికి కష్టంవచ్చినా వారివెంట తానుంటానని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ బెదిరింపులకు బెదరవద్దని, ఆ పార్టీ పట్ల ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాశలు అవుతున్నాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెందుతున్న ప్రజలు కాంగ్రెస్ పాలనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారని, వచ్చే ఎన్నికల్లో దానికి అనుగుణంగానే కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రశ్నించిన వారిని నియంత్రించేలా వ్యవహరిస్తుందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, ఇప్పటి నుంచే దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని హితవు పలికారు. నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగానే పార్టీకి నష్టం జరుగుతున్నదని, దానిని వీడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహరావు, తిలక్, దీపక్‌చౌదరి, నాయకులు పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, పంతంగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.