ఖమ్మం

శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), ఫిబ్రవరి 13: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పరమశివుని కొలిచేందుకు భక్తులు మంగళవారం తెల్లవారుజామునుండే శివాలయాలకు పరుగులు తీశారు. భక్తజనం పోటెత్తడంతో శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగాయి. తెల్లవారు జామునే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలను తీసుకుని దగ్గరలోని శివాలయాలకు కుటుంబ సమేతంగా వెళ్ళి శివపార్వతులకు ప్రత్యేకపూజలు, అర్చనలు, అభిషేకములు, కుంకుమార్చనలు నిర్వహించారు. నగరంలోని కాల్వొడ్డులోని శ్రీ భ్రమరాంబసమేత శ్రీగుంటుమల్లన్న స్వామి ఆలయం, సుగ్గులవారితోటలోని అన్నపూర్ణాంబసమేత కాశీ విశే్వశ్వరాలయం, శ్రీనివాస్‌నగర్‌లోని పార్వతీసమేత శివనాగరాజేశ్వరస్వామి ఆలయం, ఇల్లెందు క్రాస్‌రోడ్‌లోని జలాంజనేయస్వామి ఆలయం, ఎనె్నస్టీ రోడ్‌లోని శ్రీమాతా కనకదుర్గ నాగలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు నగరంలోని షిరిడీ సాయి ఆలయాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని ప్రత్యేకపూజలు, ముందుగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పాలభిషేకం, చంద్రాభిషేకం, రుద్రాభిషేకం, విభూదాభిషేకం, కుంకుమాభిషేకం, హోమం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు రోజంతా ఉపవాసదీక్షను కొనసాగించారు. కాల్వఒడ్డులోని శివాలయంలో సోమవారం రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణం కన్నులపండువగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. తెల్లవారుతున్నకొద్ది భక్తులరద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో తోపులాటలు జరిగాయి. ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాటుచేసిన వసతులన్నీ చెల్లాచెదురైయ్యాయి. పోలీసుల రంగప్రవేశంతో తోపులాట తగ్గింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని నగరంలోని పలు ధియోటర్ల యజమానులు ఒకే టికెట్‌పై రెండు భక్తిరస భరితమైన సినిమాలను చూపించారు. చాలామంది భక్తులు మాత్రం తమ ఇంటివద్దే టివీల ముందుకూర్చుని జాగరణచేశారు. ఆయా దేవాలయాలకు అధిక సంఖ్యలో ప్రజలతో పాటు రాజకీయ పార్టీల నేతలు కూడా భారీగా హాజరుకావడం విశేషం. నగరంలోని అన్ని ఆలయాలకు స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ దంపతులు హాజరై పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి వరుసగా కుటుంబ సమేతంగా ఆలయాలకు హాజరై ప్రజలతో కలిసి పూజలు నిర్వహించడం గమనార్హం. 13వ డివిజన్‌లో జరిగిన వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరై భక్తులతో పాటు కల్యాణాన్ని తిలకించారు. అనేక చోట్ల ఏర్పాట్లలో పాల్పంచుకొని నిర్వాహకులతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నించారు. అర్థరాత్రి సమయంలో కొన్ని దేవాలయాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లో కూడా ఆయన పాల్గొనడం విశేషం. బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవంలో నంచర్ల జనార్ధనాచారి దంపతులు పీటలపై కూర్చొని కల్యాణం నిర్వహించగా ఎమ్మెల్యే దంపతులు వారితో పాటే అధిక సమయం కేటాయించడం విశేషం.
హరహర నామంతో హోరెత్తిన కోటిలింగాల
కారేపల్లి, ఫిబ్రవరి 13: మండల పరిధిలోని కోటిలింగాల శివనామస్మరణతో హోరెత్తిపోయింది. శివరాత్రి సందర్భంగా కోటిలింగాలలో మూడు రోజులపాటు జరిగే జాతర మంగళవారం ప్రారంభమైంది. భక్తులు తెల్లవారుజాము నుండే కోటిలింగాల దేవాలయం వద్ద పోటెత్తారు. ప్రధానంగా మూడుజిల్లాల నుండి అధికసంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు. ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళు సరిపోక ఎండకు భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. మండలంలో బుగ్గవాగు పక్కన గల శివాలయాలలో కోటిలింగాల ప్రధానమైంది. రెండోది గేటుకారేపల్లిలో ఇదే వాగు ఒడ్డున గల రామలింగేశ్వరస్వామి ఆలయం. ఈ వాగు ఒడ్డున కాకతీయుల కాలంలో కోటిలింగాలు ప్రతిష్ఠించారని భక్తులు చెప్పుకుంటారు. కోటిలింగాల జాతరలో ఏర్పాటు చేసిన భక్తకన్నప్ప, 101శివలింగాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మంగళవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కారేపల్లి సిఐ సాంబరాజు, ఇల్లెందు మున్సిపాలిటి చైర్మన్ మడత రామలు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ గేటు కారేపల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం కారేపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వారు ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కారేపల్లి ఎస్సై కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో 50మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఆదిదేవుని సేవలో ఎమ్మెల్యే పువ్వాడ దంపతులు
ఖమ్మం(కల్చరల్), ఫిబ్రవరి 13: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ దంపతులు తెల్లవారు జామునుండి వివిధ శివాలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్థానిక కాల్వఒడ్డులోని శ్రీగుంటుమల్లేశ్వరాలయంలో ఎమ్మెల్యేతో పాటు భార్య వసంతలక్ష్మి, తనయుడు పువ్వాడ నయన్‌రాజ్‌లు అభిషేకాలు నిర్వహించారు. అలాగే తీర్థాలలోని శంభులింగేశ్వరాలయం, దంసలాపురం కొత్తకాలనీలోని శ్రీశ్రీ శంభులింగేశ్వరాలయంలోని స్వామివారి దర్శించుకుని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రాంరభించారు. అనంతరం కూసుమంచిలోని పురాతన దేవాలయం శ్రీగణపేశ్వర శివాలయంలో పువ్వాడ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఆకుల సతీష్, కొత్త వెంకటేశ్వరరావు, కార్పోరేటర్ పాలడుగు పాపారావు, ఆళ్ళ నిరీషారెడ్డి, కనకం లక్ష్మి, కన్నం ప్రసన్నకృష్ణ, పసుమర్తి రాంమోహన్, ఆళ్ళ అంజిరెడ్డి, మందడపు బ్రహ్మరెడ్డి, జలాంజనేయస్వామి ఆలయ చైర్మన్ మోతారపు సుధాకర్ తదితరులున్నారు.